సినిమా ఇండస్ట్రీలో పది కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి తీసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్న ఈ రోజుల్లో కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘సైరత్’ చిత్రం ఏకంగా 100 కోట్లు వసూళ్లు చేసి పెను సంచలనం సృష్టించింది.  మరాఠీ భాషలో 'సైరత్ '' చిత్రం బాలీవుడ్, టాలీవుడ్,కోలీవుడ్ చిత్రాలు సైతం దిమ్మతిరిగేలా కలెక్షన్లు వసూళ్లు చేసింది. అంతే కాదు ఈ చిత్రం పెద్ద పేరున్న హీరో, హీరోయిన్ కూడా లేరు..కేవలం మంచి కథతో అద్భుత విజయం సాధించింది.
Image result for sairat movie
అయితే ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రిమేక్ చేయాలని చూశారు కానీ ఎవరూ ధైర్యం చేయలేక పోయారు. కాగా తెలుగులో  నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ బ్లాక్ బస్టర్ ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు రాక్ లైన్ వెంకటేష్. అయితే రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత అనగానే ఎవరో పెద్ద హీరో అయి ఉండొచ్చని అనుకుంటున్నారా..! అబ్బె ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి ఫెయిల్యూర్ హీరో ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం తనయుడు గౌతమ్  తో చేయాలను కుంటున్నారట.

ఈ చిత్రంపై ఇంకా ఫైనల్ చేయలేదు కానీ ఇప్పుడు వినబడుతున్న కథనం ప్రకారం పరశురామ్ దర్శకత్వంలో సైరత్ రీమేక్ చేయాలనీ అనుకుంటున్నారు ఇంకా హీరో మాత్రం ఫిక్స్ కాలేదు . మొత్తానికి ఈ చిత్రం గౌతమ్ తో చేస్తే అది కాస్త హిట్ అయితే మాత్రం మనోడికి మంచి లైఫ్ దొరికినట్లే. 

Image result for sairat movie


మరింత సమాచారం తెలుసుకోండి: