కబాలి సినిమాలో హీరోయిన్‌గా మెప్పించిన హాట్‌ లేడి రాధికా ఆప్టే రూటే సపరేట్‌. నటనకు ఆస్కారం ఉన్న సినిమా అయితే చాలు అది చిన్నదా పెద్దదా అని పట్టించుకోకుండా నటించేస్తుంది. ఏ హీరోయిన్ అయినా పెద్ద సినిమాల్లోనే నటించాలని ఆశ పడుతుంది. కానీ ఆ హాట్ లేడీ మాత్రం తనకు చిన్న సినిమాలే ముద్దు అని స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది. 
 
సౌత్‌లో స్వీట్‌గా, నార్త్‌లో హాట్ హాట్‌గా, హాలీవుడ్‌లో బోల్డ్‌గా నటిస్తున్న రాధికా ఆప్టే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. అది చిన్న సినిమానా..? పెద్దదా అని పట్టించుకోవడం లేదు. అందుకే అవుట్ ఆఫ్ ఫోకస్ కాకుండా హాట్ న్యూస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇప్పటికే ఎన్నో బోల్డ్ గా నటించి  సినీ జనాల్లో యమా పాపులారిటీ సంపాదించుకున్న రాధికా ఆప్టే, తనకు చిన్న సినిమాలే ముద్దంటూ కామెంట్స్ చేసింది.
 
చిన్న సినిమాలు అంటే రాధికా ఆప్టే వర్షన్‌లో షార్ట్ ఫిల్మ్స్ అన్నమాట. వాటిలో నటించడమే ఆమెకు చాలా ఇష్టమట. ఫీచర్స్ ఫిల్మ్స్ చేతిలో లేనప్పుడు ఖాళీగా లేకుండా ఇలాంటి చిత్రాలే చేస్తానని అంటోంది. అంతేకాదు అసలు షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేయడం ఆర్టిస్టులకు కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుందని, వీటికి ఎక్కువ సమయం కూడా పట్టదని షార్ట్ ఫిల్మ్స్ గురించి తన అనుభవాలను చెబుతోందీ అమ్మడు.
 
ఇప్పటికే అహల్య సినిమాలో తన అందాలను ఆరబోసిన  ఈ బోల్డ్ బ్యూటీ, ఇప్పుడు కూడా సుజయ్ ఘోష్ షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తోందట. కమర్షియల్ సినిమా అయినా, షార్ట్ ఫిల్మ్ అయినా రాధిక ఆప్టే స్టైల్, హాట్ ట్రీట్ ఒకేలా ఉంటాయి. అందుకే ఈ సెక్సీలేడీ షార్ట్ ఫిల్మ్ వస్తోందంటే యూత్ కూడా ఫుల్ జోష్‌ మీదుంటారు. మరి కొత్త షార్ట్‌ ఫిల్మ్‌లో ఇంకేం చూపిస్తోందనని ఎదురు చూస్తున్నారు అభిమానులు.


మరింత సమాచారం తెలుసుకోండి: