గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం... చిన్నారిపొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు.. శ్రీవారి శోభనం చిత్రంలోని `అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక` పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట పాడి తనది ఎవరూ గెలువలేని ప్రత్యేకత చాటుకున్న మదుర గాయని కోకిలమ్మ జానకమ్మ సంగీత ప్రియులకు షాక్ ఇచ్చింది. దాదాపు 6 శతాబ్ధాల పాటు తన గాత్రంతో సంగీత ప్రియులను అలరించిన జానకి ఇక పాటలు పాడనంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ది నైటెంగెల్‌ ఆఫ్‌ సౌత్ అని అభిమానులు సగర్వంగా పిలుచుకునే జానకమ్మ ఇప్పటివరకు అనేక భాషలలో పాడి మెప్పించారు.
Image result for singer janaki husband
శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి ఆమె అసలు పేరు.. తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు,తమిళం, మలయాళం,  కన్నడ బాషలలో పాడారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు. మైసూరు విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు.
Image result for singer janaki husband
10 కాల్పానికాల్‌ అనే మలయాళ చిత్రంలోని పాటనే తను పాడే చివరి పాట అని చెప్పడంతో జానకి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 1957లో తమిళ సినిమా విదియున్ విళయాట్టుతో గాయనిగా రంగప్రవేశం చేసిన జానకమ్మ 60 ఏళ్లపాటు గాయనిగా కొనసాగుతున్నారు. ఇక మలయాళ చిత్రంలోని ’అమ్మ పూవిను’ అనే ట్రాక్ తో తన పాటల ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు తెలిపారు జానకి. ఇకపై ఏ రికార్డింగులలోనూ ,అలాగే ఎక్కడా స్టేజ్ లపై కూడా తాను ప్రదర్శనను ఇవ్వనంటూ జానకి చెప్పడంతో సౌత్ సినీ ఇండస్ట్రీ అంతా షాక్ కి గురైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: