తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ టాక్ నడుస్తుంది.  ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి పదమూడు సంవత్సరాల తర్వాత తన కల నెరవేర్చిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ నెల 1 న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు యావరేజ్ టాక్ అని అన్నారు..దీంతో చిత్ర యూనిట్ ఒక్కసారే షాక్ తిన్నారు. కానీ రెండవ రోజు నుంచి అనూహ్య స్పందన వచ్చింది..సినిమా మంచి పాజిటీవ్ టాక్ రావడంతో ఇక కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో చిత్రం 50 కోట్ల క్లబ్ లో చేరగా..‘గ్యారేజ్’ ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు పెడుతుంది.
Image result for janatha garage stills
అయితే ఈ చిత్ర ఘన విజయానికి ఎన్టీఆర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి..దీంతో దర్శకులు కొరటాల శివ కు ఓ మంచి గిఫ్ట్ ఇవ్వాలానుకుంటున్నాడట. గత సంవత్సరం శ్రీమంతుడు వంటి భారీ హిట్ లభించడంతో మహేష్ కొరటాల శివ కు యాభై లక్షల విలువ గల  ఆడి కారుని గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ దానికంటే గొప్పగా ఒక డూప్లెక్ హౌజ్ ని కొరటాలకు గిఫ్ట్ గా ఇవ్వాలని చూస్తున్నాడట.  
Image result for ntr koratala
గత కొంత కాలంగా ఎన్టీఆర్ కి సరైన హిట్స్ లేక పోవడంతో బాగా ఢీలా పడ్డ సమయంలో టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి చిత్రాలు మంచి హిట్స్ సాధించడం ఇదే క్రమంలో జనతా గ్యారేజ్ భారీ విజయం సాధించడంతో మనోడ్ ఇండస్ట్రీలో హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు. ఈ సంతోషాన్ని తన దర్శకుడితో షేర్ చేసుకోవాలని  ఎన్టీఆర్ కొరటాల కు ఇంటిని గిఫ్ట్ గా ఇవ్వనున్నాడని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: