బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు లాస్య. ఆమె తన నవ్వుతోనే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని అట్రాక్ట్‌ చేస్తుంటుంది. మా మ్యూజిక్‌లో పాటల ప్రోగ్రాం ద్వారా తెలుగునాట ఇంటింటికి పరిచయమైన లాస్యను అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు కూడా..


గూగుల్‌ కంపెనీలో చేస్తున్న హైఫై జాబ్‌ను వదిలేసి తనకు నచ్చిన యాంకరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది లాస్య. చక్కటి మాటతీరుతో, సహజ అభినయంతో ఎంతోమందిని తన అభిమానులుగా మార్చుకుంది. అలాగే కో-యాంకర్‌ రవితో కలిసి ఎన్నో ప్రోగ్రాంలు చేసి అందరిని అలరించింది. ఆయా ప్రోగ్రామ్స్‌లో వీరిద్దరి మధ్య ఉన్న సానిహిత్యంతో లాస్య-రవి ప్రేమలో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వినబడుతున్నాయి. 


అయితే రవి-లాస్య కలిసి గత కొద్ది కాలంగా కలిసి యాంకరింగ్‌ చేయడం లేదు. దీంతో వీరిద్ధరి మధ్య గ్యాప్‌ వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో ఒంటరిగా ఫీలైన లాస్య మరో యువనటుడుతో లవ్‌లో పడిందని సినీజనాలు చెవులు కొరుకుంటున్నారు.


 అయితే అభిమానులకు మరింత షాకిస్తూ లాస్య గురించి ఇండస్ట్రీలో మరో న్యూస్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. యాంకర్‌ లాస్య, యువ హీరో రాజ్‌తరుణ్‌ను రహస్యంగా వివాహం చేసుకుందనే వార్తలు ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ లాస్య, రాజ్‌ తరుణ్‌ క్లోజ్‌గా ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉంది.


 వీరు ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారని, ఆ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని, అందుకే రహస్యంగా పెళ్లి చేసుకున్నారని పుకార్లు పలు వెబ్‌సైట్లలోనూ, సోషల్‌ మీడియాలోనూ వేగంగా వ్యాపిస్తున్నాయి. అయితే వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్లలో కూడా ఈ పెళ్లిపై గానీ, పెళ్లి చేసుకున్నారంటూ వస్తున్న వార్తలపైగానీ స్పందించలేదు. ఈ మౌనానికి కారణం అదేనని అంటున్నారు. మరి ఈ ఏపిసోడ్‌కు ఎప్పుడు చెక్‌ పెడతారు. ఎలా చెక్‌ పెడుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: