నిన్నరాత్రి జరిగిన రామ్ ‘హైపర్’  ఆడియో ఫంక్షన్ లో హీరో నాని రామ్ ను టార్గెట్ చేస్తూ వేసిన సెటైర్లు ఆ వేడుకకు వచ్చిన వారందరికీ తెగ నవ్వు తెప్పించాయి.  మాములుగా సినిమా పోస్టర్ల మీద హీరోయిన్స్  అందంగా కనిపిస్తారని కానీ రామ్ సినిమాల పోస్టర్లలో మాత్రం రామ్ అందంగా కనిపిస్తాడని అందువల్ల హీరోయిన్ లు రామ్ పక్కన మరింత గ్లామర్ గా కనిపించడాని ప్రయత్నిస్తారు అంటూ రాశి ఖన్నా గ్లామర్ షోని దృష్టి లో పెట్టుకుని కామెంట్ చేసాడు ఈ నేచురల్ స్టార్.  

ఇదే సందర్భంలో మాట్లాడుతూ మాట్లుడుతూ నాని తనపై తానె ఒక సెటైర్ వేసుకున్నాడు.  తన పక్కనహీరోయిన్స్  నటించినప్పుడు ఇటువంటి సమస్య ఏర్పడదని దీనికి కారణం ఏ హీరోయిన్ తన పక్కన నటించిన హీరోయిన్స్ బాగా అందంగా కనిపిస్తారని అందువల్ల హీరోయిన్స్ తన పక్కన మరింత అందంగా కనిపించడానికి హీరోయిన్స్ ఎటువంటి గ్లామర్ షో చేయనక్కరలేదు అంటూ నాని కామెంట్ చేయగానే ఆ ఆడియో ఫంక్షన్ నవ్వులతో నిండి పోయింది.  

ఆ తరువాత నాని ‘హైపర్’  టైటిల్ గురించి మాట్లాడుతూ తాను రామ్  ‘కందిరీగ’ సినిమాను చూసినప్పుడు ఆ సినిమాకు అప్పట్లో ‘హైపర్’ అనే  టైటిల్ పెడితే బాగుంటుంది అని అనుకున్నానని  ఆయితే ఇప్పటికి తాను  ఊహించుకున్న టైటిల్ లో రామ్ నటించాడు అంటూ రామ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు నాని.  ఇదే ఫంక్షన్ కు మరొక అతిధిగా వచ్చిన హరీష్ శంకర్ రామ్ గురించి మాట్లుడుతూ  రామ్ కు ఈ మూవీ టైటిల్ అన్ని విధాలా సరిపోతుంది అని అంటూ  ఈ సినిమా దర్శకుడు 
శ్రీనివాస్ పై మరో సెటైర్ వేసాడు.  

దర్శకుడు శ్రీనివాస్ ‘హైపర్’ చేసేముందు  తనకు రెండు కథలు చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ  ముందు డైరెక్టర్ శ్రీనివాస్  ‘హైపర్’ కథ తనకు చెప్పాడని  ఆ కథ తనకు బాగా నచ్చడంతో తాను శ్రీనివాస్ చెపుతాను అన్న రెండవ కథను వినని సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు.  ఇదే సందర్భంలో మరో ముందు అడుగు వేసి హరీష్ శంకర్ తానూ దర్శకుడు శ్రీనివాస్ ఒకే తరహా వ్యక్తులం అని అంటూ తమ  స్పీడ్  తమకు  ప్లస్ అదే తమకు  మైనస్ గా మారుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.  

ఇదే ఫంక్షన్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ తమ స్పీడ్ వల్ల కొన్ని యాక్సిడెంట్లు అయ్యాయని అలాగని డ్రైవింగ్ మానేయలేం కదా అని హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ వెనుక ఎన్నో అర్ధాలు ఉన్నాయి అన్న కామెంట్స్ కామెంట్స్ వినిపించాయి.  14 రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ ‘హైపర్’ సినిమా గురించి మాట్లడుతూ ఈ బ్యానర్ లో టైమ్  వచ్చినప్పుడు తాను ఒక  సినిమా చేస్తాను అంటూ  సంకేతాలు ఇవ్వడంతో త్వరలో వీరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అన్న భావన కలిగింది. 

ఏది ఏమైనా నాని రామ్ పై వేసిన సెటైర్ ఆ ఆడియో వేడుకకు హాట్ టాపిక్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: