అక్కినేని నాగార్జున నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ఓం నమో వేకంటేశాయ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా నాగార్జున నుండి భక్తి ప్రాధాన్యత కలిగిన చిత్రాలను ఆశించేవారు…ఓం నమో వేంకటేశాయ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేంకటేశ్వరస్వామి భక్తుడిగా కనిపించనున్న నాగార్జున ఈ మూవీ కోసం ప్రత్యేకమైన గెటప్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 50 శాతం షూటింగ్ ని దర్శకేంద్రుడు పూర్తిచేశాడు.


అయితే ఇప్పటి వరకూ నాగార్జున నటించిన భక్తి చిత్రాలలో నాగేశ్వరరావు సలహాలను రాఘవేంద్రరావు తీసుకునేవారు. అక్కినేని నాగేశ్వరారావు సైతం నాగార్జునతో శ్రీ రామదాసు మూవీలో కనిపించి అభిమానులను అలరించారు. అంతేకాకుండా తన పాత్రకి న్యాయం చేశారు కూడ. అలాగే నాగార్జున నటిస్తున్న ఓం నమో వేంకటేశాయ మూవీలోనూ ఓ పాత్ర కోసం అక్కినేని నాగేశ్వరరావుని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది.


అయితే ప్రస్తుతం ఇది సాధ్యం కాబట్టి…నాగాశ్వరరావు పాత్రని 3 నిముషాలకి కుదించి, ఆ పాత్రని యానిమేషన్ తో క్రియేట్ చేయనున్నారు. తాజాగా గ్రీన్ మ్యాట్ లో దీనికి సంబంధించిన సన్నివేశాన్ని దర్శకేంద్రుడు చిత్రీకరించాడంటూ ఇండస్ట్రీలో న్యూస్ వినిపిస్తుంది. మొత్తంగా నాగార్జున నటించనున్నఈ ఓం నమో వేంకటేశాయ చిత్రం అందరి ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున మరోవైపు ఈ భక్తి చిత్రం పూర్తయిన వెంటనే మరో కమర్షియల్ చిత్రంని స్టార్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.


తను చేయబోతున్న అప్ కమింగ్ కమర్షియల్ చిత్రం యొక్క కథని ఇప్పటికే ఫైనలైజ్ చేసినట్టుగా ఇండస్ట్రీ నుండి తెలుస్తుంది. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన డైరెక్టర్ ఎవరు? అనేదానిపై మాత్రం ఇంకా స్సష్టత రావాల్సి ఉంది. మరోవైపు తన తనయుల మూవీలకి సంబంధించిన పూర్తి బాధ్యతని సైతం నాగార్జున తీసుకోవటంతో…ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పనుల్లో నాగార్జున ఫుల్ బిజిగా ఉన్నాడు. ముఖ్యంగా అక్కినేని అఖిల్ ని రీ లాంచింగ్ చేసేందుకు నాగార్జున భారీ ప్రణాళిక వేసుకున్న సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: