అక్కినేని నాగార్జునకు మేనల్లుడు సుమంత్ అనే హీరో ఉన్నాడని నేటి యూత్ చాల మంది మరిచిపోయిన మాట వాస్తవం.  వరస ఫ్లాప్ లతో సతమతమైపోయిన ఈ అక్కినేని మనవడు నటించిన సినిమా విడుదలై రెండు సంవత్సరాలు దాటి పోయింది. సమంత్ నటించిన సినిమాలలో ఇప్పటికీ ‘గోదావరి’ సినిమా అప్పుడప్పుడు ఛానల్స్ లో ప్రసారం అవుతూ ఉంటుంది.

ఈ నేపధ్యంలో అతడు మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి  తిరిగి తన సత్తాను చాటుకోవడానికి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘విక్కీ డోనర్’ ను సుమంత్ రీమేక్ చేయబోతున్నాడు అని వార్తలు వచ్చి నప్పుడు పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. వీర్యదానం నేపథ్యంలో తీయబడ్డ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు చూస్తారా అంటూ చాలామంది సెటైర్లు కూడ వేసారు.

అయితే ఈసినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ విడుదల చేయపడ్డ ఫస్ట్ లుక్  చూసిన తరువాత ఈ సినిమా పై క్రేజ్ పెరగడమే కాకుండా అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునే పరిస్థతి ఏర్పడింది. దీనికి కారణం ఈసినిమాకు ఫిక్స్ చేసిన ‘నరుడా డోనరుడా’ టైటిల్.

ప్రస్తుతం ఈ టైటిల్ హాట్ టాపిక్ గా మారడమే కాకుండా చాలామంది సెలెబ్రెటీలు ఈ టైటిల్ ను మెచ్చుకుంటూ ట్విట్ చేసిన నేపధ్యంలో ఈ టైటిల్ సృష్టికర్త ఎవరూ అన్న చర్చలు మొదలు అయ్యాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ టైటిల్ ను డిజైన్ చేసింది రాజమౌళి అని తెలుస్తోంది.

సుమంత్ ఈ సినిమాకు ఎటువంటి టైటిల్ పెట్టాలో అర్ధం కాక తీవ్ర మధన పడుతున్నప్పుడు ఒక ఫంక్షన్ లో అనుకోకుండా తనకు ఎదురైన రాజమౌళితో తన బాధను వ్యక్త పరుచుకున్నప్పుడు రాజమౌళి బాలకృష్ణ నటించిన ‘భైరవ ద్వీపం’ సినిమాలోని  ‘నరుడా నరుడా’ పాటలోని అక్షరాలకు ‘డో’ అన్న అక్షరాన్ని చేర్చి ఈ సినిమాకు ‘నరుడా డోనరుడా’ అన్న టైటిల్ ఫిక్స్ చేసాడని టాక్. 

ఈ టైటిల్ సమంత్ కు బాగా నచ్చడంతో  వెంటనే రిజిష్టర్ చేయించడం ఇలా అన్ని పనులు చకచకా జరిగిపోయాయి.  అయితే అనుకోకుండా ఈ ఫస్ట్ లుక్ కు ఇంత పేరు రావడం వెనుక రాజమౌళి హస్తం ఉంది అని వార్తలు రావడంతో రాజమౌళి సుమంత్ ను కూడ ప్రమోట్ చేయబోతున్నాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: