కొంతమంది పేర్లు చెప్తే... కొన్ని భావాలు గుర్తుకొస్తాయి. అల్లు అర్జున్ అంటే యాక్టివ్ అండ్ ఎనర్జిటిక్. బన్నీ ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. పూరి జగన్నాథ్... పార్టీల మనిషి. అమలాపాల్... ఈ అమ్మడి గురించి ఇంకా మనవాళ్లకు పూర్తిగా తెలియదు. కానీ, ఈ విషయం చదివితే... ఈ అమ్మాయి కూడా మామూలు మనిషికాదని అర్థమైపోతుంది. విషయమేంటంటే... ఈ ముగ్గురి కాంబినేషన్లో ఇద్దరమ్మాయిలతో చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లు ముగ్గురూ ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా స్పెయిన్ లో ఉన్నారు. జగన్, బన్నీ వీళ్లిద్దరూ చేరారంటే పార్టీ వాతావరణం ఉండాల్సిందే కదా. అందుకే, వీళ్లు అమలాపాల్ ని తీసుకుని అక్కడ పార్టీలు చేసుకుంటున్నారట. ముఖ్యంగా ప్రేమికుల రోజునాడు ప్రత్యేక పార్టీ ఇచ్చాడట బన్నీ. ఇందులో అమలాపాల్ కూడా జోష్ తెచ్చుకుని స్టెప్పులేసిందట. ఈ ముగ్గురి జోష్ తో పబ్ వేడెక్కిపోయిందట. అక్కడ అమలను చూసిన చిత్ర బృందమంతా ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు అనుకున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: