ధోనీ చేతుల మీదుగా హైద‌రాబాద్‌లో ధోనీ ఆడియో వేడుక‌

కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ జీవిత కథ ఆధారంగా వస్తున్న 'ఎంఎస్‌ ధోనీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమా తెలుగు వెర్షన్‌ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ధోనీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు వస్తే బిర్యానీ మిస్‌ కాకూడదనిపిస్తుందని, హైదరాబాద్‌ అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి బిర్యానీ, బేకరీ బిస్కెట్లు అంటే ఇంకా ఇష్టమని పేర్కొన్నారు. 'ధోనీ' చిత్రం ఆడియో కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ మధ్య ఏమైనా తెలుగు సినిమాలు చూశారా అని వ్యాఖ్యాత సుమ అడిగిన ప్రశ్నకు ధోనీ సమాధానమిస్తూ.. రాజమౌళి రూపొందించిన బాహుబలి ఇటీవలే చూశానన్నారు. బాహుబలి సీక్వెల్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. దక్షిణ భారతంలో చిత్ర పరిశ్రమ నుంచి మంచి చిత్రాలు వస్తున్నాయన్నారు. టీమిండియాకు హైదరాబాద్‌లో మంచి రికార్డు ఉందని, ఇక్కడి ప్రేక్షకుల స్పందన టీమిండియాకు మంచి ఉత్సాహాన్నిచ్చేలా ఉంటుందన్నారు. వచ్చే ప్రపంచకప్‌కు సారథ్యం వహించాలని సినీ దర్శకుడు రాజమౌళి ధోనీని కోరారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులు కరతాళధ్వనులు, ఈలలతో సందడి చేశారు.


మజ్ను' తొలిరోజు వసూళ్ల వివరాలు


శుక్ర‌వారం విడుద‌లైన యంగ్ హీరో నాని మూవీ  'మజ్ను' భారీ వర్షాల్లోను ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. నైజాంలో 1.04 కోట్లు .. సీడెడ్ లో 35 లక్షలు .. ఉత్తరాంధ్రలో 34 లక్షలు .. ఈస్ట్ - వెస్ట్ గోదావరి జిల్లాల్లో కలుపుకుని 38 లక్షలు .. గుంటూరులో 24 లక్షలు .. నెల్లూరులో 11 లక్షలు .. కృష్ణాలో 15 లక్షలు .. ఇలా ఆంధ్ర .. తెలంగాణ ప్రాంతాల్లో కలుపుకుని మొత్తం ఈ సినిమా 2.51 కోట్లను ఓపెనింగ్స్ గా రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


స్పెషల్ సాంగ్ పూర్తిచేసిన తమన్నా


భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న 'జాగ్వార్' సినిమా కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ వాళ్లలో మరింతగా ఆసక్తిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ను తమన్నా పూర్తి చేసింది. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో తమన్నా - నిఖిల్ కుమార్ జంటపై గత 4 రోజులుగా ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ పార్టును పూర్తిచేశారు. మహాదేవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, దసరా కానుకగా అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


50 రోజుల 'శ్రీరస్తు శుభమస్తు'


అల్లు శిరీష్ మూవీ 'శ్రీరస్తు శుభమస్తు 50 రోజులు పూర్తి చేసుకుంది. అల్లు శిరీష్.. లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన 'శ్రీరస్తు శుభమస్తు' .. సూపర్ హిట్ చిత్రాల కేటగిరిలో చేరిపోయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, అన్నివర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తాజాగా 50 రోజులను పూర్తిచేసుకుంది. దాంతో అందుకు సంబంధించిన పోస్టర్ ను ఈ సినిమా టీమ్ రిలీజ్ చేసింది. కొత్తలుక్ తో.. కొత్త బాడీ లాంగ్వేజ్ తో అల్లు శిరీష్ ఈ సినిమాలో కనిపించి మెప్పించాడు. 


త్వరలో సెట్స్ పైకి బోయపాటి


బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా రూపొందనుందనే వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో బోయపాటి మరో సినిమా చేయనున్నాడనీ, అందుకోసం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రాజెక్టును పక్కన పెట్టనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ ప్రచారానికి తెరపడిపోయింది .. ఎందుకంటే బోయపాటి - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా కోసం కొత్త ఆఫీసు తీశారు. ఈ ఆఫీసులో నిన్నటి నుంచే ఈ సినిమా పనులు మొదలయ్యాయి. రకుల్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.


ఛత్రపతి శివాజీ మూవీలో గెస్టుగా సల్మాన్


ఛత్రపతి శివాజీ జీవితచరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కానుంది. రితేష్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రధారిగా ఈ సినిమాను రవి జాదవ్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ముఖ్యమైన అతిథి పాత్ర ఒకటి ఉందని చెప్పగానే, ఆ పాత్రను పోషించడానికి వెంటనే సల్మాన్ ఖాన్ ఓకే చెప్పేశాడట. తన పాత్ర తీరు తెన్నులను గురించి కూడా అడగకుండా ఆయన అంగీకరించడం పట్ల యూనిట్ అంతా ఆనందంతో పొంగిపోతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: