27 కోట్ల భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ తీసిన ‘ఇజం’ సినిమాకు జూనియర్ అందిస్తున్న సగం సపోర్ట్ కళ్యాణ్ రామ్ ను అయోమయంలో ముంచి వేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి.  దీనితో  కళ్యాణ్ రామ్ ఎటూ  పాలు పోని పరిస్థితులలో ఉన్నట్లు టాక్. ఫిలింనగర్ లో హడావిడి  చేస్తున్న వార్తల ప్రకారం జూనియర్ ‘ఇజం’ లో ఒకరెండు నిమిషాల పాటు చేసే ప్రత్యేక పాత్రకు కళ్యాణ్ రామ్ ఎంత బలవంతం పెట్టినా చివరి నిమిషంలో సున్నితంగా నొ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇందులో జూనియర్ నటించే ప్రత్యేక పాత్రకు సంబంధించిన సీన్స్ ను దర్శకుడు పూరిజగన్నాథ్ డిజైన్ చేసిన తరువాత ఆఖరి నిముషంలో జూనియర్ షాక్ ఇచ్చినట్లు టాక్.  తాను కళ్యాణ్ రామ్ తో ఒక మల్టీ స్టారర్ మూవీలో నటించాలి అన్న కోరిక తనకు కూడ ఉన్నప్పటికీ కేవలం ‘ఇజం’ కోసం కృత్రిమంగా క్రియేట్ చేయబడ్డ ఈ ప్రత్యేక పాత్రలో కనిపించడం వల్ల కళ్యాణ్ రామ్ కు పెద్దగా ఏమి కలిసిరాదు అని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో దర్శకుడు పూరిజగన్నాథ్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక కుదరక పోవడంతో జూనియర్ వాయస్ ఓవర్ తో ‘ఇజం’ ను సరిపెడుతున్నట్లు టాక్.  ఇప్పటికే భారీ బడ్జెట్ పెరిగిన ఈసినిమాకు మార్కట్ విషయంలో సమస్యలు ఏర్పడటంతో కళ్యాణ్ రామ్ జూనియర్ కు పెరిగి పోయిన టాప్ క్రేజ్ తో ఈ కష్టాల నుండి బయట పడదామని ప్రయత్నిస్తూ ఉంటే జూనియర్ అందిస్తున్న ఈ సగం సపోర్ట్ కళ్యాణ్ రామ్ కు అర్ధంకాని విషయంగా మిగిలింది అని ఫిలింనగర్ గాసిప్.

జూనియర్ ఇచ్చిన షాక్ తో వేరే మార్గం లేక కళ్యాణ్ రామ్ తన ‘ఇజం’ సినిమాను ఏ సినిమాల పోటీ లేని సమయంలో విడుదల చేయడానికి నిశ్చయించుకావడంతో ‘ఇజం’ దసరా రేసు నుండి తప్పుకుంది అని అంటున్నారు.  ఈ వార్తలు ఇలా ఉండగా జూనియర్ లేటెస్ట్ సినిమాకు దర్శకుల లిస్టులో ఒక ఊహించని ఒక టాప్ డైరెక్టర్ వచ్చి చేరాడు.

‘జనతా గ్యారేజ్’ తరువాత ఎవరి దర్శకత్వంలో నటించాలి అని మధన పడుతున్న జూనియర్ ఆలోచనలకు దర్శకుడు వినాయక్ ఒక పరిష్కారం చూపించాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య వినాయాక్ జూనియర్ ను కలిసి చెప్పిన ఒక స్టోరీ లైన్ తారక్ కు బాగా నచ్చడంతో ఇంచుమించు వీరిద్దరి కాంబినేషన్ ఓకె అయినట్లు తెలుస్తోంది.

అయితే వినాయక్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న నేపధ్యంలో ఆ సినిమా పూర్తి అయి విడుదలై వచ్చే జనవరి వరకు ఆగి ఉండాలా ? లేదంటే ఈ దర్శకుల వేట ఇలాగే కొనసాగించాలా అన్న అయోమయంలో జూనియర్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: