ఎప్పుడూ తనదైన శైలిలో  నెమ్మదిగా మాట్లాడే  రాజమౌళి  ఎన్నడూ లేని విధంగా ఉద్యేగంతో అరుపులు అరవడం మీడియాకు మాత్రమే కాకుండా  రాజమౌళి అభిమానులకు కూడ షాక్ ఇచ్చింది. ఈ ఆశ్చర్యకర సంఘటన నిన్న హైదరాబాద్ లో జరిగిన టాప్ క్రికెటర్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ధోనీ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎమ్.ఎస్. ధోనీ సినిమా తెలుగు వర్షన్ ఆడియో ఫంక్షన్ లో జరిగింది.   

ఈ ఫంక్షన్  కు ముఖ్య అతిథిగా వచ్చిన రాజమౌళి ఉద్వేగ భరితంగా ప్రసంగించి  అందరికీ షాక్ ఇచ్చాడు.  గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి ఎంతో మంది దిగ్గజాలు ఆడుతున్న సమయం నుండి  తానూ క్రికెట్ చూస్తున్న విషయాన్ని బయట పెడుతూ ఆరోజులలో మ్యాచ్ గెలుస్తామా ? ఓడుతామా ? అని భయం ఉండేది అన్న విషయాన్ని చెపుతూ ధోనీ కెప్టెన్ అయ్యాక ఆభయం పోయింది అంటూ ధోనీని ఆకాశం లోకి  ఎత్తేశాడు  రాజమౌళి. 

2011లో వరల్డ్ కప్ గెలిచాక 130 కోట్ల మంది భారతీయులంతా సంబరాల్లో మునిగి పోతే ధోనీ మాత్రం కప్ ను అందుకుని దానిని సహచరులకు అందించి తను మాత్రం పక్కకు వెళ్లి నంచున్న సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ ధోనిని కర్మ యోగి గా అభివర్ణించాడు రాజమౌళి. 

క్రికెట్ గాడ్ గా  భారతీయులు  పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కూడ తన భావోద్వేగాలను అణచుకోలేక వరల్డ్ కప్ ను పట్టుకుని ఉద్వేగానికి లోనైతే  లాంటి భావోద్వేగాలు లేకుండా నిల్చున్న ధోనిని చూస్తే  భగవద్గీత లోని నిజమైన కర్మయోగి కనిపించాడు అంటూ సంచాల నవ్యాఖ్యలు చేసాడు రాజమౌళి.  ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందకు తానూ ఎదురు చూస్తున్నాను అని అంటూ  రాజమౌళి ఎప్పుడు లేని విధంగా చాలా బిగ్గరగా మాట్లాడటం అందరికీ షాక్ ఇచ్చింది.  

తన బయోగ్రఫీ మూవీ ‘ఎంఎస్ ధోనీ' సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన మహేంద్రసింగ్ ధోని ఈఫంక్షన్ లో  మాట్లాడిన మాటలు యువతకు స్పూర్తి నిచ్చేలా ఉన్నాయి. నేటి యువత గుడ్డిగా కష్టపడడం కాకుండా  ఏమి  సాధించాలో అన్న  క్లారిటీతో లక్ష్యాన్ని చేరుకోవాలని ధోనీ నేటితరం వారికి సూచనలు చేసాడు. హైదరాబాద్ అంటే బిర్యానీ గుర్తుకొస్తుందని 2000వ సంవత్సరంలో ఇక్కడ క్రికెట్ ఆడటానికి వచ్చినపుడు బిర్యానీ రుచి చూసానని అంటూ భాగ్యనగరంతో తన అను భందాన్ని షేర్ చేసుకున్నాడు ధోని. 
అపరిచిత్’, ‘బాహుబలి’ చిత్రాలను చూశానని అంటూ   సౌత్ లో చాలా మంచి  యాక్టర్స్, డైరెక్టర్స్ ఉన్నారు అంటూ రాజమౌళి వంక చూస్తూ ప్రశంసలు కురిపించడం  ఈ ఆడియో ఫంక్షన్ కు హైలెట్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: