మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఖైదీ నెం.150’. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ని చేస్తుండగానే చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి గట్టి షాకింగ్ ఇచ్చాడని అంటున్నారు. ఈ అన్నదమ్ములిద్దరూ అటు రాజకీయాలలో ఉంటూనే, ఇటు సినిమాల్లోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తను పెట్టిన జనసేన పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవటానికి తను కమిట్ అయిన కాటమరాయుడు మూవీ అడ్డంకిగా ఉంది.


దీంతో ఈ కాటమరాయుడి మూవీతో సినిమాలకి గుడ్ బై చెప్పాలని పవన్ కళ్యాణ్ కచ్ఛితమైన నిర్ణయం తీసుకోనున్నారు. అయితే అన్న చిరంజీవి సైతం తన 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ తరువాత సినిమాలకి దూరంగా ఉండే ఛాన్స్ ఉందని భావించారు. కానీ మెగాస్టార్ చిరంజీవి స్పీడుని చూస్తుంటే... ‘ఖైదీ నెం.150’ సినిమా తరువాత కూడ వరుస చిత్రాల్లో నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.


ఎందుకంటే ‘ఖైదీ నెం.150’ మూవీ తరువాత చిరంజీవి చేయబోయే సినిమాలకి సంబంధించిన కథలు సైతం ప్రస్తుతం రెడీ అవుతున్నాయి. ‘ఖైదీ నెం.150’ సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక చిరు 151వ సినిమా గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కనుందని అంటున్నారు. చిరు వరుస సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉండటంతో...పవన్ కళ్యాణ్ సైతం షాక్ అవుతున్నాడు.


ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి చిరంజీవి తన వంతు సలహాలను అందించే అవకాశం ఉందని గత కొంత కాలంగా మెగాకాంపౌండ్ లో చర్ఛలు జరుగుతున్నాయి. కానీ తాజాగా ఇటువంటి పరిస్థితి లేదనేది చిరు నుండి స్పష్టత వచ్చింది. ఇది ఒకరకంగా పవన్ కళ్యాణ్ కి చిరంజీవి షాక్ ఇచ్చాడనే అంటున్నారు. ఇక త్వరలోనే చిరు 151వ సినిమా అనౌన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: