నాగచైతన్య సమంతల పెళ్ళి వచ్చే సంవత్సరంలో జరగబోతున్న నేపధ్యంలో ఇప్పటికే సినిమాలు పూర్తిగా తగ్గించి వేసిన సమంత చైతన్యతో కలిసి ఒక నవలా చిత్రంలో నటించడానికి కౌంట్ డౌన్ మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి.  ప్రముఖ నవలా రచయిత చేతన భగత్ నవల ఆధారంగా నిర్మింప బడిన బాలీవుడ్ హిట్ మూవీ ‘2 స్టేట్స్’ ను టాలీవుడ్ లో రీమేక్ లో నటించడానికి సూత్ర ప్రాయంగా నాగచైతన్య తన అంగీకారం తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.  

కరణ్ జోహార్ బాలీవుడ్ లో నిర్మించిన ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు రావడమే కాకుండా కలక్షన్స్ పరంగా కూడ బాలీవుడ్ లో ఈసినిమాకు కనక వర్షం కురిసింది.  బాలీవుడ్ అర్జున్ కపూర్ ఆలియా భట్ లు జంటగా నటించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ కొన్నట్లుగా వార్తలు ఇప్పటికే వచ్చాయి.  

అయితే ఈ తెలుగు రీమేక్ లో నాగ చైతన్య, సమంతలు నటించినప్పుడు మాత్రమే ఈ మూవీ ప్రాజెక్ట్ కు క్రేజ్ వస్తుంది అన్న ఉద్దేశ్యంతో అభిషేక్ పిక్చర్స్ నిర్మాతలు
నాగాచైతన్యను ఈ మూవీలో నటించడానికి ఒప్పించడమే కాకుండా సమంత హీరోయిన్ గా నటించే విధంగా చైతూ ద్వారా ఈ సినిమా నిర్మాతలు సమంత పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దర్శకుడు వి.వి. వినాయక్ దగ్గర 10ఏళ్ల పాటు అసిస్టెంట్ గా వర్క్ చేసిన వెంకట్ కుంచెం అనే సహాయ దర్శకుడు ఈసినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు.  చైతన్య తెలుగు వాడు కావడం సమంత మలయాళీ కావడంతో వారి రియల్ లైఫ్ కు దగ్గరగా ఈ సినిమాలోని పాత్రలు సరిగ్గా సరిపోతాయి అన్న భావనతో ఈ సినిమా నిర్మాతలు వీరిద్దరికీ భారీ పారితోషికాలను ఆఫర్ చేస్తున్నట్లు టాక్.

చేతన భగత్ నలలలో ఎంతో ప్రసిద్ధి గాంచి వేలాది కాపీలు అమ్ముడు పోయిన ఈ నవలలోని ప్రేమికుల పాత్రలను నిజజీవితంలోని నిజమైన ప్రేమికులు చైతూ సమంతలు పోషిస్తున్న నేపధ్యంలో ఈ సినిమా గ్యారెంటీ హిట్ అని అంటున్నారు.  ఈసినిమాను త్వరగా ప్రారంభించి చైతూ సమంతల పెళ్ళి అయ్యే లోపే విడుదల చేయాలని ఈ సినిమా నిర్మాతల మాస్టర్ ప్లాన్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: