చిన్న సినిమాలతో వరుస హిట్స్ ని అందుకొని మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ సినిమాలు అంటే కచ్ఛితంగా ఇండస్ట్రీ హిట్ లుగా మారుతాయనేది డైరెక్టర్స్ అభిప్రాయం. అందుకే తను నటించిన ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21F’ వంటి చిత్రాలు రాజ్ తరుణ్ కి మంచి పేరుని తీసుకువచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన హీరోకి ఇలా వరుస హిట్స్ పడటం అనేది చాలా అరుదు.


ఈ సక్సెస్ లతో రాజ్ తరుణ్ కి మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక హీరోయిన్స్ సైతం ఈ కుర్రహీరోతో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోయిన్స్ తో రాజ్ తరుణ్ కి మంచి పరిచయాలే ఉన్నాయని అంటున్నారు. అందరి హీరోయిన్స్ తో రాజ్ తరుణ్ క్లోజ్ గా మూవ్ అవ్వటమే కాకుండా, కొంత మంది హీరోయిన్స్ తో వ్యవహారం అక్కడ వరకూ తీసుకువచ్చాడని అంటుంటారు.


తాజాగా ఇండస్ట్రీకి వచ్చిన ఓ కొత్త హీరోయిన్ తో రాజ్ తరుణ్ డేటింగ్ వరకూ వెళ్లాడనేది ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వ్యవహారం. అయితే ఈ వ్యవహారంలో హీరోయిన్ రాజ్ తరుణ్ పై ఒత్తిడి తీసుకురావటంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో హాట్ హాట్ గా వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై స్పంధించిన హీరో రాజ్ తరుణ్...ఇలాంటివి రాసేవాళ్ళకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనేది తనకు అర్థం కావడం లేదని అన్నారు.


అలాగే లాస్యతో తనకు ముడిపెట్టడం కూడ సరిగా లేదని చెప్పుకొచ్చాడు. తనేంటో అందరి హీరోయిన్స్ కి తెలుసు...ప్రత్యేకంగా చెప్పుకోవల్సింది ఏమీ లేదు అంటూ రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ చాలా కామన్ కాబట్టి ఇక పై ఈ తరహా పుకార్లకి సైతం స్పందించేది లేదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: