టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతూ..ఎవ్వరూ సాధించలేనంత సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసిన మూవీ బాహుబలి. ఈ బాహుబలి కారణంగా కొంత మంది ఆర్టిస్ట్ లకి భారీగా అవకాశాలు వచ్చాయి. అయితే  'బాహుబలి' సినిమాలో 'కాలకేయుడు' చేసిన ప్రభాకర్ కి మాత్రం తగిన గుర్తింపు ఇంకా రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో కనిపించే విలన్స్ కి తలదన్నేలా కనిపించే ప్రభాకర్ రూపం...నేటికి చాలా మంది డైరెక్టర్స్ కి కనిపించదనే చెప్పాలి.


అయితే బాహుబలి మూవీ అనంతరం ప్రభాకర్ గ్యాప్ లేకుండా ఏదొక సినిమాలో చేస్తూనే ఉన్నాడు. కానీ బాహుబలికి వచ్చిన బ్రేక్...తరువాత సినిమాలలో రాలేదు. ఇందుకు కారణం.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని యంగ్ డైరెక్టర్స్ కి ప్రభాకర్ అంటే చిన్న చూపు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడే ఓ విచిత్రం జరుగుతుంది. ప్రభాకర్ ని టాలీవుడ్ కంటే...సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఇతర ఇండస్ట్రీల డైరెక్టర్స్ బాగా గౌరవిస్తున్నారు.


ముఖ్యంగా తమిళ, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీల నుండి ప్రభాకర్ కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 'కాలకేయుడు' స్థాయిలో తనకి మంచి గుర్తింపు తెచ్చే పాత్ర కోసం ప్రభాకర్ సైతం ఎదురుచూస్తున్నాడు. తాజాగా మలయాళంలో మెయిన్ విలన్ గా ప్రభాకర్ చేసే అవకాశం వచ్చింది. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో మోహన్ లాల్ కథానాయకుడిగా ఓ చిత్రం రానుంది.


ఇందులో ప్రాధాన విలన్ గా ప్రభాకర్ కనిపించనున్నారు. మోహన్ లాల్ చిత్రం కాబట్టి తనకి మంచి పేరుని తీసుకువస్తుందని ప్రభాకర్ నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఇక హీరో మోహన్ లాల్ సైతం విలన్ కి మంచి ప్రాధాన్యత ఉంటుందని ప్రభాకర్ కి చెప్పుకొచ్చాడంట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: