ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ కాస్టింగ్ సెలక్షన్ అంటే చిన్న విషయం ఏ మాత్రం కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి పాత్రకి ఎంతో కాంపిటీషన్ ఉంటుంది. అయితే ఆఫర్స్ ని చేజిక్కించుకునే లాజిక్కుని కనుక్కుంటే...ఆ ఆర్టిస్ట్ లకి అవకాశాలు వరుస పెట్టి వస్తాయి. ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్స్ ఒక్కసారిగా టాప్ హీరోయిన్ గా స్టార్ డంని పొందాలంటే కచ్ఛితంగా అందుకు కొన్ని లాజిక్కలు ఉంటాయి.


సరైన సమయంలో  సరైన నిర్ణయం తీసుకుంటేనే స్టార్ డంని పొందటానికి ఛాన్స్ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా స్టార్ హీరో అల్లుఅర్జున్ మూవీలోనూ హీరోయిన్ ఆఫర్ ని పొందటానికి పలువురు హీరోయిన్స్ విశ్వప్రయత్నాలు చేశారు. అందులో ఫైనల్ గా కీర్తి సురేష్ సెలక్ట్ అయిందని అంటున్నారు. అయితే కీర్తి సురేష్ కి అల్లుఅర్జున్ సరసన నటించే ఛాన్స్ రావటానికి చాలానే కష్టపడింది.


నిజానికి అల్లుఅర్జున్ మొదటగా కీర్తి సురేష్ ని వద్దన్నాడనే విషయం బయటకు వచ్చింది. కానీ కీర్తి సురేష్ డైరెక్టర్ వైపు నుండి గేమ్ ఆడి...అల్లుఅర్జున్ సరసన హీరోయిన్ ఆఫర్ ని తెచ్చుకుందని అంటారు. వీటి పూర్తి వివరాలను చూస్తే...త్వరలోనే లింగుస్వామి దర్శకత్వంలో అల్లుఅర్జున్ మూవీ ప్రారంభం కానుంది. ప్రస్తుతం హీరోయిన్ కి సంబంధించిన చర్ఛలు వేగంగా జరుగుతుంది. మొదట కీర్తి సురేష్ ని అల్లఅర్జున్ వద్దన్నాడంట.


అయితే లింగుస్వామితో కీర్తి సురేష్ కి మంచి పరిచయాలు ఉన్నాయి. దాంతో కీర్తి సురేష్...లింగుస్వామి ద్వారా అల్లుఅర్జున్ ని మరోమారు ఒప్పించే ప్రయత్నం చేయిచింది. దాంతో అల్లుఅర్జున్ సైతం ఒప్పుకోక తప్పని పరిస్థితి అయిందని అంటున్నారు. మొత్తంగా కీర్తి సురేష్ ఏదైతో అనుకుందో దాన్ని ఫైనల్ గా సాధించుకుందని అంటున్నారు. ఈ విషయంలో ఒకింత అల్లుఅర్జున్ సైతం ఆశ్ఛర్యపోయాడని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: