జోరుమీదున్న‌ మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంగా 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ముందుగానే చెప్పేశారు. అందువలన ఆ సమయానికి అన్నిపనులు పూర్తయ్యేలా చూసుకోవలసిందే. ఈ కారణంగానే ఈ సినిమాలో ఇంతవరకూ తాను చేసిన సీన్స్ కి డబ్బింగ్ చెప్పుకోవడానికి చిరంజీవి రంగంలోకి దిగారు. ఇప్ప‌టికే చిరు తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో వెరైటీగా ప్లాన్ చేసే పనిలో చరణ్ వున్నాడు. ఈ సినిమాకి గల ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని వినాయక్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  


అల్లుఅర్జున్‌కు జోడీగా కీర్తిసురేష్ 


స్ట‌యిలీష్ స్టార్ అల్లుఅర్జున్ తమిళంలో తొలి మూవీతో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. లింగుస్వామి దర్శకత్వంలో రెండు భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీలో అల్లుఅర్జున్ నెగెటివ్ షేడ్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కోలీవుడ్ డెబ్యూట్ ప్రాజెక్టులో నటించేందుకు హీరోయిన్ కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో నేను శైలజ సినిమా హిట్‌తో కీర్తిసురేష్ మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అల్లుఅర్జున్, హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో తాజాగా ‘దువ్వాడ జగన్నాథమ్’ (డీజే)తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.


లాస్యతో పెళ్లి వార్తలను ఖండించిన రాజ్ తరుణ్ 


తాను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నానంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై యంగ్ హీరో రాజ్ తరుణ్ తీవ్రంగా ఖండించాడు. టీవీ యాంకర్ లాస్యను రాజ్ తరుణ్ మ్యారేజ్ చేసుకున్నాడని రీసెంట్ గా టాలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఈ హీరో ఫేస్‌బుక్ ద్వారా స్పందించాడు. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని స్పష్టం చేశాడు. "కుమారి 21 ఎఫ్ ఆడియో వేడుకలో ఒకేఒక్కసారి కలసిన లాస్యతో నా సంబంధం లేకుండా, నా ప్రమేయం లేకుండా నా పెళ్లి చేసిన మీడియా మిత్రులకు నా థ్యాంక్' అంటూ వ్యంగ్యంగా ప్రారంభించి, "ఇలా అంటున్నందుకు సారీ. ఇలాంటి హాస్యాస్పదమైన, ఫన్నీ రూమర్లకు ఎలా స్పందించాలో తెలియడం లేదు. కనీసం మరో మూడేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే నాకు లేదు" అంటూ రాజ్ తరుణ్ స్ప‌ష్టం చేశాడు.


కాటమరాయుడు మూవీలో మానసహిమవర్ష 


ప‌వ‌ర్ స్టార్ పవన్‌కళ్యాణ్ కాటమరాయుడుగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కిశోర్‌పార్థసాని (డాలీ)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది కన్నడ నటి మానస హిమవర్ష. ఈ విషయాన్ని మానస హిమవర్ష ట్విట్టర్ ద్వారా తెలిపింది. కాటమరాయుడు మూవీలో తాను పవర్‌స్టార్ మరదలు పాత్రలో నటిస్తున్నాన‌ని. లంగావోణి, సల్వార్‌కమీజ్‌లో పల్లెటూరి అమ్మాయిగా ఇంట్లో ఉన్న అందరినీ ఆటపట్టించే పాత్రలో కనిపిస్తాన‌ని.. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నానని వెల్లడించింది.


రావణుడిగా ప్రకాశ్ రాజ్ 


ఎటువంటి పాత్రనైనా తనదైన శైలిలో పోషించి మెప్పించగల అభినయం విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాశ్ రాజ్ సొంతం. పాజిటివ్ పాత్ర‌లోనైనా, నెగిటివ్ పాత్ర‌లోనైనా మెప్పించ‌గ‌ల నేర్పు ఆయ‌న సొంతం. ఇప్పుడు కూడా ఇలాంటి విబిన్న తరహా పాత్రను ఆయన 'మనవూరి రామాయణం' సినిమాలో పోషిస్తున్నాడు. ఇది రాముడి రూపంలో వుండే రావణుడి పాత్ర అని ప్రకాశ్ రాజ్ చెప్పాడు. తనే ప్రధాన పాత్రధారిగా స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర కథ గురించి ఆయన తాజాగా వెల్లడించాడు.
"రాముడి రూపంలో కనిపించే రావణుడి కథ ఇది. శ్రీరామ నవమి రోజున ఒక ఊరిలో జరిగే ఓ సంఘటనతో ఈ చిత్ర కథ సాగుతుంది. కథ నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతూ, రామాయణంలో జరిగిన కొన్ని సంఘటనలను మనకు గుర్తు చేస్తుంది" అని చెప్పారు. అక్టోబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ప్రియమణి హీరోయిన్ గా నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: