మంచు లక్ష్మి  ‘మేము సైతం’ కార్యక్రమాన్ని  ఎంతో  సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఎందరో ఆర్తులకు సహాయ సహకారాలు అందిస్తోంది.  ఈ కార్యక్రమం ద్వారా ఈమె చేస్తున్న సమాజ సేవచూసి ఎందరో ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.  దీనితో ఆమె పేరు బుల్లితెర పై మారు మ్రోగి పోతోంది.  మోహన్ బాబు  కుమార్తెగా  తన హవా కొనసాగిస్తున్న లక్ష్మి ప్రసన్న తెలుగు ఉచ్ఛరించే విధానం కర్ణకఠోరంగా ఉంటుందన్న విషయం ఓపెన్ సీక్రెట్. 

ఈమె  మంచు వారి వారసురాలు కాకపోతే ఈ స్థాయిలో బుల్లితెరపై అవకాశాలు వచ్చి ఉండేవి కాదు అనే కామెంట్స్ కూడ ఉన్నాయి.  అయితే ఈ కామెంట్స్ ఎలా ఉన్నా క్రేజీ బ్యూటీ సమంత ఈ మధ్య అనుకోకుండా  అన్న మాటలు ఈమెను టార్గెట్ చేసేవిగా ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఆశక్తికరమైన ఈ న్యూస్ వివరాలోకి వెళ్ళితే బుల్లితెరపై ‘మేము సైతం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంచు లక్ష్మి కార్యక్రమానికి సమంత అతిధిగా రావడమే కాకుండా తానుకూడా డబ్బు సేకరించడానికి జనం మధ్యకు వెళ్ళి  వస్తువులు అమ్మింది  ఈ కార్యక్రం ఈ మధ్యే ప్రసారం అయింది. 

ఈ కార్యక్రంలో  తెలుగులో గలగలమంటూ మాట్లాడుతున్న సమంతను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మంచు లక్ష్మి  ‘నాకు, తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదని, నా కంటే నువ్వే తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు’ అని అంది. ఆ కామెంట్స్ కు చిరునవ్వు నవ్విన సమంత తనకు కూడ తెలుగు సరిగా రాదని, కష్టపడి నేర్చుకుని మాట్లాడుతున్నానని అంటూ రివర్స్  పంచ్ వేసింది సమంత. 

దీని తో  తెలుగు అమ్మాయి గా పుట్టిన మంచు లక్షి  తెలుగు నేర్చుకోక పోయినా తానూ తెలుగు కష్టపడి నేర్చుకున్నాను అని అర్ధం  వచ్చేలా సమంత మాటలు  ఉన్నాయి అంటూ కామెంట్స్ పడుతున్నాయి.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమంత 2012లో సంభవించిన ఘటన తన ఆలోచనలను మార్చివేసిందని అని అంటూ  ఆ సంఘటన సంఘటన తరువాత  మూడు నెలలపాటు తీవ్ర నిరాశలో కూరుకుపోయిన విషయాన్ని చెపుతున్నప్పుడు ఆమె హీరో సిద్దార్థ్ తో బ్రేక్ అప్ విషయాన్ని గుర్తుకు చేసుకుంటోoదా? అని చాలా మందికి అనిపించింది. 

ఇదే సందర్భంలో ఆమె మాట్లుడుతూ తాను బాగా డబ్బున్న కుటుంబం నుంచి రాలేదని, కింది మధ్యతరగతి కుటుంబంలో ఉన్నప్పటికీ తన తల్లి పేదరికాన్ని ఏనాడూ సమస్యగా భావించలేదని చెప్పుకొచ్చింది.  2012లో తన జీవితంలో చోటుచేసుకున్న సంఘటన తరువాత తాను జీవిస్తున్న విధానం సరైనదేనా అని ఆలోచన చేసుకున్నట్లు  సమంతా చెపుతూ  తాను ఉన్నా లేకున్నా తన తల్లి చెప్పిన మాట మాత్రం బతకాలని భావించానని అందుకోసమే ప్రత్యూష ఫౌండేషన్‌ ను ప్రారంభించానని అని చెపుతున్నప్పుడు ఆమె ముఖంలో అనేక భావాలు వ్యక్తం కావడం స్పష్టంగా కనిపించింది..



మరింత సమాచారం తెలుసుకోండి: