తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత హరికృష్ణ తనయులు కళ్యాన్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  ఇండస్ట్రీలో కళ్యాన్ రామ్ చాలా తక్కువ చిత్రాలతో వస్తూ బాగానే ఫామ్ అయ్యారు. ఇక జూ. ఎన్టీఆర్ అయితే టాప్ హీరో లీస్టులో చేరిపోయారు. ఈ నెల 1 న రిలీజ్ అయిన ‘జనతా గ్యారేజ్’ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతుంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో ‘నాన్నకు ప్రేమతో’నిలిచిపోగా ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లో జనతా గ్యారేజ్ చిత్రం నిలవనుంది. తాజాగా కళ్యాన్ రామ్ కి ఎన్టీఆర్ పెద్ద షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Image result for kalyan ram ijam
విషయంలోకి వెళితే..ప్రస్తుతం కళ్యాన్ రామ్ ‘ఇజం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే..ఈ చిత్రానికి పూరీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో స్పెషల్ అప్పీరియన్స్ కోసం ఎన్టీఆర్ ని గెస్ట్ రోల్ నటించమని కళ్యాన్ రామ్.. ఎన్టీఆర్ ని అడిగినట్లు దానికి ఎన్టీఆర్ నిర్మొహమాటం లేకుండా వద్దన్నయ్యా ! అలా చేస్తే నాకు ఇబ్బంది పైగా సినిమాకు ఎలాంటి ఉపయోగం ఉండద అన్నారట.
Image result for kalyan ram ijam
ఒకవేళ ఇద్దరం కలిసి మరో సినిమా చేద్దాం ఎందుకంటే మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నామంటే తప్పకుండా అంచనాలు భారీ గా ఉంటాయి కాబట్టి ఈ సినిమా వద్దు అని చెప్పేశాడట. దీంతో మనోడికి దిమ్మతిరిగే షాక్ అయ్యిందట. తర్వాత నిజమే ఇద్దరు కలిసి నటిస్తే సినిమాపై అంచనాలు పెరుగుతాయి కానీ..ఎన్టీఆర్ గెస్ట్ అంటే గెస్టు గానే మిగిలిపోతుందని  అని రియలైజ్ అయ్యాడట కళ్యాణ్ రామ్.



మరింత సమాచారం తెలుసుకోండి: