కొద్దిరోజులుగా హిట్ మజాను ఎంజాయ్ చేయడానికి దూరంగా ఉన్న తారక్ ఇప్పుడు మళ్లీ ఫాంలోకి వచ్చేసినట్టే. ఇక తన సినిమాలతో మిగతా హీరోలకు రసవత్తరమైన పోటీ ఇస్తున్న జూనియర్ రీసెంట్ గా జనతా గ్యారేజ్ హిట్ తో తాను హిట్ కొడితే సౌండ్ ఎలా ఉంటుందో చూపించాడు. కొరటాల శివ డైరక్షన్లో వచ్చిన జనతా గ్యారేజ్ కెరియర్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది.


కెరియర్ మొదట్లో కేక పెట్టించే సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన తారక్ మధ్యలో గాడి తప్పాడు. ఇక టెంపర్ నుండి మళ్లీ బ్యాక్ టూ ఫాం వచ్చాడు. నాన్నకు ప్రేమతోతో సింపుల్ హిట్ అందుకుని గ్యారేజ్ తో తన ఖలేకా ఏంటో మరోశారి చూపించేశాడు. ఇక తారక్ తన తర్వాత సినిమా మీద దృష్టి పెడుతున్నాడు. తనతో సినిమా తీసేందుకు నలుగురు దర్శకులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు.


అయితే వారిలో ఎవరిని తారక్ సెలెక్ట్ చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. అసలైతే తారక్ తో సినిమాకు పూరి అంతా రెడీ చేసుకుంటున్న ఇంకా ఎందుకో ఆ ప్రాజెక్ట్ మీద పూర్తి నమ్మకం కుదరట్లేదు. కెరియర్ లో కొత్త టర్న్ తీసుకున్న జూనియర్ ఇక నుండి కొత్త కొత్త సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. బట్ ఫర్ ఏ ఛేంజ్ అని తనని తానే మార్చుకున్న జూనియర్ ఇక నుండి అన్ని సినిమాలు జనతా హిట్ ని తెలపిస్తాయని నమ్మకంతో ఉన్నాడు.


అందుకే కథ కథనాల మీద పూర్తి దృష్టి పెట్టబోతున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఉన్న ఈ కొత్త ఊపుకి పూరి అయితేనే మరో అదిరే హిట్ అందిస్తాడని పూరితో సై అనేస్తున్నాడు జూనియర్. మరి మారిన ఎన్.టి.ఆర్ రానున్న రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: