సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించున్న హీరోయిన్ అనుష్క. ప్రస్తుతం అనుష్క టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ లను చేస్తుంది. బాహుబలి వంటి ప్రతిష్టాత్మమైన చిత్రమే కాకుండా అనుష్క చేతిలో మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో అనుష్క ని టార్గెట్ చేసుకుంటూ కొంత మంది తనపై రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇందుకు అనుష్క రియాక్ట్ అయింది.


గతంలోనూ తనపై చాలా మంది రూమర్స్ క్రియేట్ చేసేవారని...అయితే అవన్నీ అసత్యాలు కావటంతో అంతగా పెట్టించుకోలేదు. అయితే ఈ తరహా రూమర్స్ పై తను రియాక్ట్ కాకపోవటంతో వారు మరింతగా రెచ్ఛిపోతున్నారు. ఇది ఇలానే కంటిన్యూ అయితే అందరూ వాటిని నిజమే అనుకుంటారు అని చెప్పుకొచ్చింది. అందుకే తాజాగా తనపై వస్తున్న పెళ్ళి వార్తలు, ఇతర హీరోలతో డేటింగ్ వంటి వాటివి నిజం కాదు అని ఖరాఖండిగా చెప్పుకొచ్చింది.


ఈ తరహా వార్తలు ప్రస్తుతం తనని బాగా ఇబ్బంది పెట్టాయి కాబట్టి...ఈ విధంగా స్పంధించాల్సి వచ్చిందని అంటున్నారు. మొత్తంగా అనుష్క బాధపడిన తీరు చూస్తే....రూమర్స్ నిజంగానే తనని ఇబ్బంది పెట్టాయని అంటున్నారు. ఈ తరహా కామెంట్స్ కారణంగా మనఃశాంతి కోల్పోవడం జరుగుతుందని చెబుతోంది. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో తనకి సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను సైతం ఈ బ్యూటీ కొట్టిపారేసింది.


ఇవన్నీ కల్పిత వార్తలు అంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి వార్తలను ఎలా రాస్తారో...అస్సలు తెలియటం లేదని చెప్పుకొచ్చింది. అనుష్క ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ ఏనాడూ ఇంతలా రియాక్ట్ కాలేదని అంటున్నారు. ఇక తను నటిస్తున్న బాహుబలి2 కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ని రీసెంట్ గా ఈ బ్యూటీ పూర్తి చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: