వరస పరాజయాలతో సతమతమైపోతూ త్వరలో రాబోతున్న ‘ధృవ’ తిరిగి తనకు ప్రాభవాన్ని కలిగిస్తుంది అని ఆశలు పెట్టుకున్న రామ్ చరణ్ కు ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ఎమ్.ఎస్. ధోని క్రేజ్ కలిగింబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.  దీనికి కారణం ఈ నెల 30వ తారీఖున భారీ అంచనాలతో విడుదల అవుతున్న ‘ఎమ్.ఎస్. ధోని’ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాత్రను చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ విషయాన్ని చివరివరకు సస్పెన్స్ గా కొనసాగించి ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందున అధికారికంగా ప్రకటిస్తారు అని ఫిలింనగర్ టాక్.  ఈవార్తలు ఇప్పటికే మెగా కాంపౌండ్ దృష్టికి వెళ్ళినా ఇంతవరకు ఖండించని నేపధ్యంలో ‘ఎమ్.ఎస్. ధోని’ మూవీలో చరణ్ ప్రత్యేక పాత్ర ఖాయం అన్న హడావిడి మొదలైంది.  

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ ధోని పాత్రను పోషిస్తున్న సుశాంత్ పక్కన సురేష్  రైనా గా కనిపించబోతున్నాడు అని టాక్. ఇదే సినిమాలో
పాకిస్తానీ యాక్టర్ ఫవాద్ ఖాన్ విరాట్ కోహ్లీ గా కనిపించబోతున్నాడు.  వీరితో పాటు దిశా పటాని అనుపమ్ ఖేర్ భూమికలు కూడ ఈ సినిమాలో నటిస్తున్నారు.ఎప్పటి నుంచో చరణ్ కు ఒక సూపర్ హిట్ నటించాలి అన్న కోరిక ఉన్నా ఆ కోరికను చరణ్ నటించిన ‘జంజీర్’ తీర్చలేక పోయిన నేపధ్యంలో ఆ లోటును ఏమ్.ఎస్. ధోనీ తీరుస్తుందని ఆసపడుతున్నాని టాక్.

 ఈవార్తలు ఇలా ఉండగా ఈ సినిమాను నిర్మించడానికి తన అంగీకారాన్ని ఈసినిమా నిర్మాతలకు తెలియచేసినండులకు కాను ఎమ్. ఎస్. ధోనికి 45 కోట్ల భారీ గుడ్ విల్ ఎమౌంట్ ఇచ్చారు అన్న వార్తలు బాలీవుడ్ మీడియాలో ప్రచారంలో ఉన్నా అవి నమ్మసక్యంగా లని పించడం  లేదు.

దీనికితోడు ఈసినిమాకు సంబంధించి ఎమ్.ఎస్. ధోనీతో అంగీకారానికి సంబంధించిన వ్యవహారాలకు రాయబారిగా తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహించిన ధోనీ బిజెనెస్ మేనేజర్ కు కూడ 5 కోట్ల భారీ పారితోషికం ఈ సినిమా నిర్మాతలు ఇచ్చారు అని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తూ ఉండటంతో ఎన్ని వందల కోట్ల కలక్షన్స్ ఈ సినిమాకు వస్తాయి అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా గత కొంత కాలంగా హిట్స్ లేక బాధ పడుతున్న చరణ్ ‘ఎమ్.ఎస్. ధోని క్రేజ్ ఎంత వరకు చరణ్ క్రేజ్ ను పెంచడానికి సహకరిస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: