టాలీవుడ్లో సరిగ్గా హీరోయిన్స్ కొరత ఉన్న టైంలో దిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సక్సెస్ తో చిన్నగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ భామ ఇప్పుడు స్టార్ సినిమా అంటే చాలు మొదట ఆమెను అడిగాకే వేరే వారికి వెళ్లే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు కోటికి తగ్గకుండా డిమాండ్ చేస్తున్న ఈ భామ మొదటి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ తో అందరికి షాక్ ఇచ్చింది.


కెరియర్ మొదట్లో ఎవరైనా అవకాశాల కోసమే చూస్తారు డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. అయితే అప్పటిదాకా మోడల్ గా యాడ్స్ చేసుకుంటూ వచ్చిన రకుల్ ఒక్కసారిగా హీరోయిన్ ఆఫర్ రాగానే ఐగిరి గంతేసింది. అయితే తను నటించిన మొదటి సినిమా ఇది అని చెప్పాకుండానే దానిలో నటించిందినందుకు తనకు కేవలం 6 లక్షలు మాత్రమే ఇచ్చారని అంటుంది.


మొదటి సినిమాకు 6 లక్షలు అంటే అదేం పెద్ద అమౌంట్ కాదు అలా అని అది మరి తక్కువని కాదు. మోడలింగ్ నుండి హీరోయిన్ గా వస్తున్న భామల్లో చాలా మంది క్లిక్ అవ్వకుండా పోయారు. అంతేకాదు చుక్కలనంటే పారితోషికం డిమాండ్ చేసినా ముందే తొక్కేస్తారని తెలుసుకున్న రకుల్ క్రేజ్ వచ్చేదాకా అలానే తక్కువ రెమ్యునరేషన్ కే చేసింది.


ఇక అమ్మడు చేస్తున్న సినిమాలన్ని సూపర్ హిట్స్ అవ్వడంతో ఇంకేముందు ఏకంగా రెమ్యునరేషన్ కూడా కోటి తగ్గకుండా డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా రకుల్ తక్కువ టైంలోనే భారీ క్రేజ్ తెచ్చుకుంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టు కోవాలని ప్రస్తుతం అటు టాప్ హీరోల సినిమాలు చేస్తూనే మరో పక్క కుర్ర హీరోలతో కూడా భారె పారితోషికం ఇస్తే ఓకే అనేస్తుంది. సో మొత్తానికి రకుల్ రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యిందని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: