సమంత అక్కినేని వారి కుటుంబ కోడలు అవ్వడం ఖాయం అయిన తరువాత రెండు రోజుల క్రితం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి చాల సాంప్రదాయంగా వచ్చింది సమంత. ఈ నేపధ్యంలో సమంతకు అప్పుడే అక్కినేని కుటుంబ కోడలి లుక్ వచ్చింది అంటూ కామెంట్స్ కూడ వినిపించాయి.  

అయితే నిన్న సమంత శాస్త్రబద్ధంగా హిందూ మతంలోకి మారిపోయింది అని వార్తలు రావడంతో ఇక సమంత తన పెళ్ళికి అన్ని విధాలా మానసికంగా సిద్ధ పడుతోంది అని  అనుకున్నారు అంతా. అయితే ఈ సఘటన జరిగి కొన్ని గంటలు కూడ గడవ కుండానే సమంత చెన్నైలో జరిగిన ‘రిట్జ్’ అవార్డు వేడుకలకు తన హాట్ లుక్స్ ను ఎక్స్ పోజ్ చేస్తూ బ్లాక్ డ్రస్ లో చేసిన క్లీవేజ్ షోను చూసి అందరూ షాక్ అయ్యారు.  

అంతేకాదు ఆమె ఎక్స్ పోజింగ్ ముందు ఈ కార్యక్రమానికి హాజరైన మిగతా హీరోయిన్స్ గ్లామర్ ఎక్స్ పోజింగ్ ఏ మాత్రం సరిపోలేదు అంటే అతిశయోక్తి కాదు అన్న మాటలు వినిపించాయి.  దీనితో మీడియా కెమెరాలు అన్నీ సమంత హాట్ లుక్స్ ను ఎక్స్ పోజ్ చేయడానికి తమ వంతు ప్రయత్నాలను చాల గట్టిగా చేసాయి.  

ఇప్పుడు ఈఫోటోలు సోషల్  మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో సమంత హాట్ లుక్స్ ను ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. దీనితో సమంత తన పెళ్ళి టైమ్ దగ్గర పడుతున్న కొద్ది తన ఎక్స్ పోజింగ్ డోసేజ్ ను ఎందుకు ఇలాగ పెంచుతోంది అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
  

ఈ రిట్జ్ సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అవార్డుల్లో భాగంగా ‘సౌత్ ఇండియాస్ మోస్ట్ అడ్మైర్డ్ ఫ్యాషన్ ఐకాన్’  అవార్డును సమంత అందుకున్న నేపధ్యంలో ఇలా హాట్ గా కనిపించాలని సమంత ఇలా తన విశ్వరూపం ప్రదర్శించి ఉంటుంది అంటూ మరికొందరు ఘాటైన సెటైర్లు వేస్తున్నారు. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా సమంత మాత్రం ఆ విషయాలను పట్టించుకోకుండా ఒకవైపు సినిమాలను తగ్గించి వేసాను అని అంటూ మరో వైపు ఇలా ఎక్స్ పోజింగ్ డోస్ పెంచడం వెనుక అర్ధాలు ఏమిటో ఆ మాయలేడి సమంతకే తెలియాలి.

అయితే సమంత ఇలా రోజుకొక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ మీడియా కెమెరాలకు తెగ పని కలిపిస్తున్న నేపధ్యంలో రోజురోజుకు పెరిగి పోతున్న ఆమె క్రేజ్ ను చూసి నాగార్జున ఎంతో కొంత ఖంగారు పడతాడు అనుకోవడంలో సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: