ఇలాంటి సినిమా చేయ‌ను: త‌మ‌న్నా

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. ఈ సినిమా అక్టోబర్‌ 7న విడుదలవుతుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా తమన్నా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా గురించి తమన్నా మాట్లాడుతూ... 3 భాషల్లో ఒక సినిమాను చేయడమంటే ఎంత కష్టమో తెలిసింది. ఇకపై ఇలాంటివి చేయను అని తమన్నా చెప్పుకొచ్చారు. మూడు బాషల్లో సినిమా అంటే..కంటిన్యూగా వర్క్‌ చేయాల్సి ఉంటుంది. మూడు భాషల్లో మూడు రకాల లిప్‌ మూమెంట్స్‌తో డైలాగ్స్‌ చెప్పడం, మూడు భాషల లిప్‌ మూమెంట్స్‌కు తగిన విధంగా డ్యాన్స్‌ మూమెంట్స్‌లో చిన్న వేరియేషన్స్‌తో మళ్లీ చేయడం, ఇలాంటివి గ్యాప్ లేకుండా చేయడం వల్ల అంతా చాలా అలసి పోయామని తమన్నా తెలిపారు.


రికార్డు సృష్టించిన ‘ప్రేమమ్‌’ చిత్రం ట్రైలర్‌


నాగచైతన్య, శ్రుతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడొన్నా సెబాస్టియన్‌ ప్రధాన తారాగణంగా రూపుదిద్దుకుంటున్న ‘ప్రేమమ్‌’ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ నెల 20న యూట్యూబ్‌లో విడుదలైన చిత్రం ట్రైలర్‌ను ఇప్పటి వరకు 20 లక్షలమందికి పైగా చూశారు. ఈ విషయంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. మలయాళంలో విజయం సాధించిన ‘ప్రేమమ్‌’కు రీమేక్‌గాఅదే టైటిల్‌తో తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతం సమకూర్చారు. త్వరలో ‘ప్రేమమ్‌’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 


షూటింగ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్


డైరెక్ట‌ర్ డాలీ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న మూవీ షూటింగ్ స్పీడందుకుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా సినిమా సెట్స్‌లో జాయి అయిపోయారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో జరిగే ప్రేమకథగా ప్రచారం పొందుతోన్న ఈ సినిమా షూటింగ్ మొత్తాన్నీ డిసెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది.


‘హైపర్‌’ సెన్సార్ పూర్తి - సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్‌


ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 


'అర్జున'గా వస్తోన్న రాజ‌శేఖ‌ర్


డాక్ట‌ర్ రాజశేఖర్ హీరోగా 'అర్జున' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. అయితే ఈ సినిమా ఇటీవల కాలంలో నిర్మించబడింది కాదు. కొంతకాలం క్రితం ఈ సినిమాను చంద్రశేఖర్ నిర్మాణంలో కణ్మణి తెరకెక్కించాడు. రాజకీయాల తీరుతెన్నులకి సంబంధించిన నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా, కొన్ని కారణాల వలన ఆగిపోయింది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: