స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడున్న ఫాం ఏంటో అందరికి తెలిసిందే.. కేవలం తెలుగులోనే కాకుండా కేరళలో అల్లు అర్జున్ ఓ సెపరేట్ క్రేజ్ ఏర్పడేలా చేసుకున్నాడు. అయితే ఇప్పుడు బన్ని దృష్టి కోలీవుడ్ మీద పడ్డది. తమిళంలో తెలుగు హీరోలకు మార్కెట్ తక్కువే కాని అక్కడ హీరోలు మాత్రం ఇక్కడ మంచి ఇమేజ్ సంపాదించారు. అందుకే ఈ ప్రయత్నంలో ఇప్పుడు బన్ని కోలీవుడ్ మార్కెట్ ను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.


ప్రస్తుతం దువ్వాజ జగన్నాథం సినిమా చేస్తున్న బన్ని ఆ తర్వాత మూవీ కోలీవుడ్ సెన్షేన్షనల్ డైరక్టర్ లింగుస్వామితో కలిసి చేస్తున్నాడు. పందెం కోడి సినిమాతో తెలుగులో కూడా తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్న బన్ని ఈ సరికొత్త సినిమాతో తెలుగు తమిళ భాషల్లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్లో ఉండటంతో ఈ సినిమాలో తాను రెమ్యునరేషన్ తీసుకోకుండా నైజాం రైట్స్ వరకు తనకు కావాలని అన్నాడట.


సాధారణంగా బన్ని మార్కెట్ ప్రకారం తన ప్రతి సినిమా 12 నుండి 14 కోట్ల దాకా పలుకుతాయి.. సినిమా హిట్ అయితే 16 నుండి 18 కోట్లదాకా వస్తాయన్నమాట. రెమ్యునరేషన్ పరంగా అంటే ఎక్కువ డిమాండ్ చేసినట్టు ఉంటుందని నైజాం రైట్స్ తన సొంతం చేసుకున్నాడు బన్ని. కె.యి.జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవనుంది.


బన్ని మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో తన సత్తా చాటాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. మరి లింగుస్వామి మీద పెట్టుకున్న నమ్మకాన్ని అతనెలా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: