సెంటిమెంట్లకు చిరునామా సినిమా రంగం.  సినిమా టైటిల్ దగ్గర నుంచి సినిమా విడుదల తేదీ వరకు రకరకాల సెంటిమెంట్లు సినిమా హీరోలను వెంటాడుతూ ఉంటాయి.  సంక్రాంతి సీజన్ కు టాప్ హీరోల సినిమాల మధ్య పోటీ సర్వసాధారణమే అయినా రాబోతున్న సంక్రాంతి పోటీ మటుకు మరింత సంచలనంగా మారింది.

చిరంజీవి 150వ సినిమా బాలకృష్ణ 100వ సినిమా రాబోతున్న సంక్రాంతిని టార్గెట్ చేసుకుంటూ విడుదల అవుతున్న నేపధ్యంలో బాలయ్య – చిరంజీవిల వార్ పై అందరి దృష్టి ఉండటమే కాకుండా ఈ వార్ లో ఎవరు విజేతలు అవుతారు అన్న విషయమై అప్పుడే అంచనాలు కడుతున్నారు.  దీనితో నందమూరి అభిమానులు మరియు మెగా అభిమానులు కూడ తమతమ అంచనాలు లెక్కలకు పదును పెడుతున్నారు. 

ఈ వార్తలు ఇలా ఉండగా మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులైన కొందరు చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ ని సంక్రాంతి సీజన్ కు కాకుండా సమ్మర్ సీజన్ కు విడుదల చేస్తే బాగుటుంది కదా ? అని కొన్ని సూచనలు రామ్ చరణ్ కు ఇస్తున్నట్లు టాక్.  ఇలాంటి సూచనలు కొందరు చరణ్ కు ఇవ్వడం వెనుక ఒక కారణం ఉంది అని అంటున్నారు.

మెగా స్టార్ చిరంజీవి గత సినిమాల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే సంక్రాంతికి విడుదలైన సినిమాలకన్నా సమ్మర్ కు విడుదలైన సినిమాలు చిరంజీవి కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారి బాగా కలిసివచ్చిన నేపధ్యంలో ‘ఖైదీ నెంబర్ 150’ ని సమ్మర్ కు విడుదల చేస్తే బాగుటుంది కదా అని కొందరు సూచనలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  దీనికితోడు బాలకృష్ణకు సంక్రాంతి సీజన్ గతంలో చాల సార్లు కలిసి వచ్చిన నేపధ్యంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తో అనవసరపు పోటీ ఎందుకు అని కొందరు సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకుని చరణ్ కు సూచనలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే రామ్ చరణ్ ఈ సూచనలను సున్నితంగా తిరస్కరిస్తూ ఇప్పటికే సినిమా నిర్మాణం చాల భాగం పూర్తి అయిన నేపధ్యంతో పాటు ఈ సినిమా బిజినెస్ కు సంబంధించి ఆఫర్లు కూడ బాగా వస్తున్న నేపధ్యంలో ఇటువంటి సెంటిమెంట్లు తాను పట్టించుకోను అని సున్నితంగా చెప్పినట్లు ఫిలింనగర్ టాక్.

ఈ వార్తలు ఇలా ఉండగా రామ్ చరణ్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ కు రేట్స్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం నైజాంకు 20 కోట్లు – ఆంధ్రాకు 30 కోట్లు - ఓవర్ సీస్ 14 కోట్లు ఇలా భారీ రెట్లు ఫిక్స్ చేస్తూ  కర్ణాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియా, శాటిలైట్, డిజిటల్ రైట్స్, అడియో రైట్స్ అన్నీ కలిపి 100 కోట్ల పైన బిజినెస్ చేయడానికి చరణ్ పక్కా మాస్టర్ ప్లాన్ రచించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో సంక్రాంతి రేసుకు వస్తున్న బాలయ్య సినిమాను ఎదిరించి మరికొన్ని చిన్న సినిమాల పోటీను కూడా తట్టుకుని ‘ఖైదీ నెంబర్ 150’ అనుకున్న అంచనాలను చేరుకుంటుందా ? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: