ఈ వారం విడుదల కాబోతున్న ‘హైపర్’  సెన్సార్ కార్యక్రమాలు నిన్న పూర్తి చేసుకున్నట్లు గా వార్తలు వస్తున్నాయి.  ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాను చూసి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ వర్గాలు ఒకవైపు ఈసినిమాను పొగుడ్తూనే మరోవైపు చేసిన ఆ శక్తికర కామెంట్స్ రామ్ ను కొద్దిగా ఖంగారు పెడుతున్నట్లు టాక్.

వరస పరాజయాల తరువాత ‘నేను శైల‌జ‌’  తో మ‌ళ్లీ ఫామ్ లోకి వచ్చిన రామ్ ఫ్లాప్స్‌లో ఉన్న సంతోష్ శ్రీ‌నివాస్‌ని న‌మ్మి ఈ ‘హైపర్’ సినిమాను చేసిన విషయం తెలిసిoదే.  ఈ  సినిమా పూర్తి కమర్షియల్ సినిమాగా ఉందని సినిమా మొత్తం కమర్షియల్ లెక్కలకు అనుగుణంగా తీర్చి దిద్దారని సెన్సార్ వర్గాలు కామెంట్ చేసినట్లు టాక్.

అయితే సినిమాలో లాజిక్కులు మిస్సయ్యాయ‌ని, మితిమీరిన హీరోయిజం, ఓవ‌ర్ డోస్ డైలాగులు సామాన్య ప్రేక్షకులను ఖంగారు పెడతాయని అంటూ కొందరు సెన్సార్ బోర్డు సభ్యులు ఈసినిమా పై కామెంట్స్ చేసినట్లు వచ్చిన వార్తలు రామ్ ను టెన్షన్ లో పెడుతున్నట్లు టాక్. తండ్రి కొడుకుల అనుభందాన్ని ఒక కొత్త కోణంలో చెప్పడానికి దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చేసిన ప్రయత్నం ఈసినిమాకు ఒక వెరైటీ అని అంటున్నారు. 

ముఖ్యంగా  రామ్ స‌త్యరాజ్‌ల మ‌ద్య న‌డిచే ఎమోష‌న్ డ్రామా ఈ సినిమాకి ప్రధాన ఆక‌ర్షణ అని తెలుస్తోంది. ఇంట్రవెల్  ముందు వ‌ర‌కూ ఈ సినిమా కథ చాల కామెడీగా నడిచి ఇంట్రవెల్ ముందు ఓ కీల‌క‌మైన టర్న్ తీసుకొంటుంద‌ని తెలుస్తోంది. యాక్షన్ మోతాదు ఎక్కువగా ఉన్నా ద‌ర్శకుడు అక్కడ కూడా ఎంట‌ర్‌ టైన్‌మెంట్ మిక్స్ చేసి ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి నచ్చేలా తీర్చిదిద్దాడ‌నితెలుస్తోంది.  స‌త్యరాజ్‌, రావు ర‌మేష్‌ పాత్రలు ఈసినిమాకు హైలెట్ అని ఈ సినిమాతో రావు ర‌మేష్‌ సీరియ‌స్ విల‌నీ కెట‌గిరీలోకి చేరిపోతాడని సెన్సార్ వర్గాలు అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది.

ఇక ఈసినిమాలో రాశీ ఖ‌న్నా గ్లామ‌ర్ మోతాదు అమాంతం పెరిగిపోయింద‌ని పాట‌ల్లోనే కాకుండా  కొన్ని సీన్స్‌ లో కూడా రాశి ఖన్నా గ్లామర్ ఎక్స్ పోజింగ్ టాప్ రేంజ్ లో ఉందని టాక్.  రామ్ రాశీల కెమిస్ట్రీ ఈసినిమాకి ప్రధాన ఆకర్షణగా మారి మాస్ ని బాగా ఆకర్షిస్తుందని అంటున్నారు.  

దసరా రేస్ ను ప్రారంభిస్తూ ఈనెల 30వ తారీఖున విడుదల అవుతున్న ఈసినిమాను ప్రస్తుతం రామ్ కు ఉన్న క్రేజ్ రీత్యా చాల భారీ మొత్తాలకు బిజినెస్ చేసి విడుదల కాకుండానే ఈసినిమా లాభాల బాట పట్టింది అన్న వార్తలు వస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: