తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్స్ కేవలం నటకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు. వారి ముఖంలో హావభావాలు అద్భుతంగా పండిస్తూ క్యారెక్టర్ లో పూర్తిగా లీనమైన నటించే వారు. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ అంతగా నటించడానికి ఆస్కారమే లేకుండా పోయింది..సినిమా మొత్తానికి నాలుగైదు సీన్లు నాలుగు పాటలకే పరిమితం అవుతున్నారు. ఇక కొంత మంది హీరోయిన్లకు మాత్రమే నటించే చాన్సు వస్తుంది. దీంతో ఇప్పుడు టాప్ హీరోయిన్లు సైతం రూట్ మార్చారు..సినిమా మొత్తం కాకుండా ఒక్క ఐటమ్ సాంగ్ తీస్తే చాలు డబ్బుకు డబ్బు పేరుకి పేరు వస్తుంది.
Image result for tamanna item songs
ఇక బాలీవుడ్ లో మొదలైన ఈ సాంప్రదాయం అన్ని ఇండస్ట్రీల్లోకి పాకింది. టాప్ హీరోయిన్ల చేత ఒక్క ఐటమ్ సాంగ్ చేయిస్తే సినిమాపై ఒకరకమైన క్రేజ్ ఏర్పడుతుందని దర్శక,నిర్మాతల అభిప్రాయం. రీసెంట్ గా ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో ఇప్పటి వరకు టాప్ హీరోయిన్ గా ఉన్న కాజల్ కూడా ఐటమ్ సాంగ్ లో నటించింది. ఆ మద్య మహేష్ బాబు తో శృతి హాసన్ ఐటమ్ సాంగ్ లో నటించింది. ఇప్పటికే తమన్నా ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ బాగా డబ్బు గడిస్తుంది.
Image result for tamanna item songs
తాజాగా ఈ ఐటమ్ సాంగ్స్ పై తన అభిప్రాయాన్ని చెబుతూ..సినిమాకు హెల్ప్ అవుతుందని అనుకుంటే ఐటెం సాంగ్ చేస్తారని ఇక నా విషయానికి వస్తే నేను ఎక్కువ డబ్బు వస్తుందనే ఐటెం సాంగ్స్ చేస్తున్నానని నిర్మొహమాటం లేకుండా చెప్పేసింది మిల్కీ బ్యూటీ తమన్నా . జాగ్వార్ చిత్రంలో ఐటెం సాంగ్ చేసినందుకు 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది ఈ భామ. సినిమా  నా ఐటమ్ సాంగ్ కి ప్రత్యేకత ఉంటుంది..అంతే కాదు నాకు డబ్బు కావాలి అందుకే ఐటమ్ సాంగ్ లో నటిస్తున్న అంటుంది ఈ మిల్కీ బ్యూటీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: