ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు పెళ్లి చేసుకున్న హీరోయన్స్ తిరిగి…ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇస్తున్నారు. అటువంటి వారిలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పటికే ఇండస్ట్రికి ఎంట్రి ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో వస్తున్న హీరోయిన్ జెనీలియా. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జెనీలియా మీరోయిన్ గా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలను చేశారు. అలాగే విజయాలను కూడ అందుకున్నారు.


తను ఏ చిత్రంలో నటించినా తనదైన ముద్ర చూపించారు. అయితే జెనీలియా కెరీర్ లో తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేశారు. తమిళ్, హిందీ భాషల్లో చాలా తక్కువ చిత్రాలని చేశారని చెప్పాలి. అందుకే ఈసారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న జెనీలియా ఎక్కువుగా తమిళ్, హిందీ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది. హిందీ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లాడిన ఈ బ్యూటీ…భర్త నుండి ఫుల్ పర్మిషన్ ని తీసుకొని ఈ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తుంది. ఇక కోలీవుడ్ హీరో జీవీ.ప్రకాశ్‌కుమార్ ఇప్పుడు జెనీలియాతో రొమాన్స్ చేయనున్నారు.


వరుస విజయాలను అందుకుంటున్న జీవీ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. బ్యూస్‌టీ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాక రామ్‌బాలా దర్శకత్వంలో ఒక మూవీ ఉంది. ఇక ఈ మూవీకి సంబంధించిన కాంబినేషన్ ఓసారి చూసుకుంటే ఇందులో హీరోయిన్ గా జెనీలియా నటించనున్నట్లు తెలుస్తుంది. కేవలం నటించటమే కాకుండా తన రీ ఎంట్రీ కొంచెం ఘాటుగా ఉండేలా చూసుకుంది.హీరో జీవి.ప్రకాష్ తో తను ఈ మూవీలో లిప్ లాక్స్ చేయనుందనిఅంటున్నారు.


అలాగే కాస్త ఎక్స్ పోజింగ్ సైతం ఎక్కువుగానే ఉండేలా జెనీలియా ప్లాన్ చేస్తున్నరు. సెకండ్ ఇన్నింగ్స్ తరువాత ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోలేదని జెనీలియా స్వయంగా చెప్పటం ఇక్కడ విశేషం. గతంలో తను ఎలా నటించానో….ఇప్పుడు దాని కంటే మోతాదు కొంచెం ఎక్కువుగా ఉంటుందని చెప్పుకొచ్చింది. మొత్తంగా జెనీలియా తన సెకండ్ ఇన్నింగ్ పై భారీ ఆశలే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ త్వరలోనే రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: