దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు సంబంధించి మొదటి రోజు మొదటి ఆట టిక్కెట్లకు కూడ లేనంత క్రేజ్ ‘జాగ్వార్’ మొదటిరోజు మొదటి షో టిక్కెట్టుకు ఏర్పడటం నమ్మసక్యంకాని వార్తగా మారింది.  అయితే ఈ వార్తలు వాస్తవం అని అంటున్నాడు ఈసినిమా నిర్మాత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.  

కన్నడ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ దసరాకు రాబోతున్న ‘జాగ్వార్’ మూవీ టిక్కెట్ ను వేలం వేయగా ఎవ్వరూ ఊహించని విధంగా ఒక వ్యక్తి 10 లక్షలకు ‘జాగ్వార్’ మొదటిరోజు మొదటి షో టిక్కెట్ ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ‘జాగ్వార్’  మూవీ టికెట్ల కోసం ఈ చిత్ర యూనిట్ ఒక ఛానల్ లో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో టికెట్ల కోసం అభిమానులు పోటీ పడ్డారు.  

మైసూరుకు చెందిన లోకేశ్ అనే వ్యక్తి అత్యధికంగా పది లక్షలకు ‘జాగ్వార్’  సినిమా మొదటి టికెట్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఇప్పుడు ఈ న్యూస్ కన్నడ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయాలు అన్నీ పూర్తిగా నిజం కాదని కేవలం ‘జాగ్వార్’ కు విపరీతమైన క్రేజ్ తీసుకు రావడానికి ఈ హడవిడిని చాల వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు అంటూ కన్నడ మీడియా కామెంట్స్ చేస్తోంది.    

కన్నడ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం ‘జాగ్వార్’ మూవీ హీరో నిఖిల్ గౌడా ఫ్యామిలీకి  చెందిన వారే ఇలా మారుపేరుతో ఈ బిడ్ వ్యవహారం  నడిపించారని వార్తలు వస్తున్నాయి. తెలుగు కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుమారు 16 దేశాలలో వెయ్యికి పైగా స్క్రీన్లలో విడుదల చేస్తు ఉండటం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది.  

రాజమౌళి శిష్యుడు మహదేవ్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈసినిమాకు కథను అందించి 75 లక్షలను పారితోషికంగా తీసుకున్నాడని టాక్.  దాదాపు 75  కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ భారీ సినిమాకు రెండు కోట్లు పబ్లిసిటీకి ఖర్చు పెడుతున్నారు అంటే ఈ సినిమా నిర్మాతలు ఎంత సాహసం  చేస్తున్నారో అర్ధం అవుతుంది. 

టాలీవుడ్ లో ఈసినిమా ఆడియో ఇప్పటికే విడుదలైన నేపధ్యంలో ఈసినిమా ఆడియో సక్సస్ మీట్ ను త్వరలో విశాఖపట్నంలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించి ఆ ఫంక్షన్ కు ఎట్టి పరిస్తుతులలోను పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధిగా తీసుకు రావాలని కుమార్ స్వామి చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఒక డబ్బింగ్ సినిమా టాలీవుడ్ లో చేస్తున్న హడావిడికి టాలీవుడ్ అంతా షాక్ అవుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: