గత నెల నుంచి తెలుగు రాష్ట్రాలో భారీ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన టాపిక్ నయీమ్.  ఒక సామాన్య వక్తి పది వేల కోట్లకు పైగా ఆస్తులు సంపాదించడాని తెలిసిన తర్వాత అటు పోలీసులు,ఇటు రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు నివ్వెర పోయారు.  వాస్తవానికి నయీమ్ ఎన్ కౌంటర్ జరిగే వరకు అతడు ఓ సామాన్యమైన క్రిమినల్ గానే తెలుసు. సెటిల్ మెంట్లు, బెదిరింపులు, కిడ్నాపింగ్స్ లాంటివి చేస్తూ నయీమ్ చేసిన దందాలు మామూలు స్థాయిలోనే ఉన్నాయని భావించారు. కానీ ఎప్పుడైతే నయీయ్ గ్రేహౌండ్స్ చేతిలో ఎన్ కౌంటర్ గావింపబడ్డాడో వెంటనే అతని ఆస్తులపై రైడ్ చేయగా పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు బయటకు వచ్చాయి.  

నయీమ్ కి సంబంధించిన అనుచరలు అతడు కొనసాగించిన రాక్షసకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. నయీమ్ కేవలం బెదిరించడమే కాకుండా తనకు లొంగని వారిని నిర్థాక్షిన్యంగా చంపడం లాంటివి చేసేవాడట.  అంతే కాదు మైనర్ అమ్మాయిలను కూడా బలవంతంగా అనుభవించడం లొంగకపోతే వారిని చంపడం..చిత్ర హింసలకు గురి చేయడం చేసేవాడని..తాను బయట తిరిగేటపుడు ఆడవారి వేషాలు వేసే వాడని..తను సెటిల్ మెంట్స్ గోవాల చేసేవాడని అక్కడ కూడా ఆడవారిని తీసుకొని వెళ్లి ఎంజాయ్ చేసేవాడని ఇలా రోజుకో కొత్త న్యూస్ నయీమ్ గురించి వస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం నయీమ్ కేసు సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచటన దర్శకుడు రాంగోపాల్ వర్మ నయీప్ పై మూడు భాగాలుగా సినిమా తీస్తానని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇవ్వడమే కాదు ఏకంగా సినిమా కూడా మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. దీనికి సంబంధించి ‘నయీమ్’ పై ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు రాంగోపాల్ వర్మకు  నయీమ్ అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయట. మర్యాదగా వర్మ చేయాలనుకుంటున్న సినిమా ఆపివేయాలని లేకుండా చంపేస్తామని బెదిరిస్తున్నాట.

ఇప్పటికే వర్మ జీవిత చరిత్రలు ఆధారంగా చేసుకొని సినిమాలు తీశారు..ఇలాంటి బెదిరింపులు తనుకు కొత్తేమీ కాదని పెద్ద పెద్ద డాన్ లు బెదిరిస్తేనే తాను భయపడలేదని అంటున్నారు వర్మ. అంతే కాదు నయీమ్ అనుచరులను కూడా తాను కలిశానని సంఘంలో జరుగుతున్నదే తాను చిత్ర రూపంలో అందిస్తానని అంటున్నారు. ఏది ఏమైనా తన సంచలన చిత్రాలతో ఆడియన్స్ కి ఎప్పుడూ థ్రిల్స్ అందించే వర్మ నయీపై ఎలాంటి చిత్రం తీయనున్నారో వేచి చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: