కెనడియన్ పోర్న్ స్టార్ గా సన్నీలియోన్ అందరికి సుపరిచితమే. సన్నీలియోన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇవ్వకముందు ఈ బ్యూటీ పోర్న్ స్టార్ గా ఇంటర్నేషనల్ బిజినెస్ ని కలిగిఉంది. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎప్పుడైతే సన్నీలియోన్ ఎంట్రి ఇచ్చిందో అప్పటి నుండి ఈ బ్యూటీకి పేరు మారిపోయిందనే చెప్పాలి. మొదట పోర్న్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సన్నీలియోన్, చిన్నగా ఆ పేరు నుండి బయటకు వచ్చింది.


ఇప్పుడు సన్నీలియోన్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ గానే చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ బ్యూటీకి ఇతర స్టార్ హీరోయిన్స్ స్థాయిలోనే బహిరంగ వేధికల్లో స్థానం దక్కుతుంది. ఇక తాజాగా సన్నీలియోన్ తీసుకున్న నిర్ణయం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని కదిలించిందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... సన్నీలియోన్ తాజాగా ఓ ఇరవై మంది పేద పిల్లలకు చదువు చెప్పించే బాధ్యతని తీసుకుంది.


ప్రస్తుతం వారికి 7 సంవత్సరాల వయస్సు. ఈ వయస్సుతో ఉన్న 20మంది పిల్లలకి పిజి వరకూ అయ్యే ఖర్చుని తనే భరిస్తానని చెప్పకురావటం విశేషం. ఒక ఛారిటీలో తలదాచుకుంటున్న వీరు...ఇప్పుడు సన్నిలియోన్ నుండి ఉన్నత విధ్యను పొందటానికి అర్హులుగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ...సన్నీలియోన్ ఔదర్యాన్ని కొనియాడుతున్నారు.


ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తనకి ఇచ్చిన గౌరవానికి ఇది తిరిగి ఇస్తున్న ప్రేమగా సన్నీలియోన్ చెప్పుకురావటం విశేషం. త్వరలోనే దీనికి సంబధించిన ఫార్మాలిటీస్ ని సన్నీలియోన్ పూర్తి చేయనుంది. పిజీ వరకూ అయ్యే ఖర్చును సన్నీలియోన్ సింగిల్ పేమెంట్ లో ఆ చారీటికి ఇవ్వనుంది. భవిష్యత్ లో తనకు సంబంధం లేకుండా వారి చదువుకి సంబంధించిన అన్ని కార్యక్రమాల నిర్వాహకం పూర్తి కావాలనేది తన కోరికని అంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: