ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనానికి కేంద్రబింధువుగా మారాడు. నిజజీవిత సంఘటన ఆధారంగా వర్మ సినిమాలను తెరకెక్కించటంలో తనకుతానే సాటి. తాజాగా ఎన్ కౌంటర్ లో మరణించిన నయీం జీవితం ఆధారంగా ప్రస్తుతం వర్మ సినిమాను రూపొందించనున్నాడు. నయీం జీవితంపై వర్మ రిసెర్చ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిసెర్చ్ లో వర్మ, నయీం జీవితం గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు.


పోలీసులకి సైతం తెలియని ఎన్నో విషయాలు వర్మ కి తెలిసాయనే ప్రచారం సైతం జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా నయీం గ్యాంగ్ నుంచి తనకు బెందిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని వర్మ తెలిపిన విషయం తెలిసిందే. ఇందుకు వర్మ తనదైన శైలిలో నయీం గ్యాంగ్ కి కౌంటర్ ఇచ్చాడు. తాను నయీం లకే నయీం నని, భయపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చాడు.


తాజాగా ముంబైలో నయీంతో పాటు జైల్ లో ఉన్న ఒక వ్యక్తిని, పోలీసు అధికారులను, నయీంతో కలిసి పని చేసిన ఇద్దరు నక్సలైట్ లను తాను కలిసి సమాచారం సేకరించుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా వర్మకి...రాజకీయ నాయుకుల నుండి సైతం బెధిరింపు కాల్స్ వస్తున్నాయి. తెలుగులో ఈ మూవీని తీయకుడదని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారట.


అంతే కాకుండా ఒకవేళ సినిమా తెరకెక్కిస్తే...ఆ మూవీకి రాజకీయనాయులకి ముందుగా చూపించి రిలీజ్ చేయాలని హెచ్ఛరిస్తున్నారంట. ఈ నేపథ్యంలో వర్మ మరోసారి కామెంట్ చేయనున్నారని తెలుస్తుంది. అయితే నయీం కేసు గురించి వర్మ తెలుసుకుంటున్న సమాచారంలో ఓ ఆసక్తికమైన విషయం బయటకు వచ్చింది. కరాచీలో ఉండే ఓ పెద్ద వ్యక్తితో నయీంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిసి వర్మ షాక్ అయ్యాడంట.



మరింత సమాచారం తెలుసుకోండి: