తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు తీసినా కొంత మంది నటులకు అస్సలు స్టార్ డమ్ కలిసి రాదు..కానీ కొన్ని సినిమాలకే కొంత మంది హీరోలకు ఒక్కసారిగా స్టార్ డమ్ కలిసి వస్తుంది. అలాంటి నటుడే నాని..ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే ‘అష్టచెమ్మ’చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. తర్వాత వచ్చిన సినిమాలు యావరేజ్ గా వచ్చినా..గత సంవత్సరం ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో ఒక్కసారే స్టార్ డమ్ కలిసి వచ్చింది.  ఈ సంవత్సరం ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’,‘జంటిల్ మాన్’ చిత్రాలు వరుసగా హిట్స్ కావడంతో గత శుక్రవారం రిలీజ్ అయిన ‘మజ్ను’ చిత్రంపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన అను ఇమ్మానుయేల్ నటించింది .
Image result for nani gentleman
ట్రైయాంగులర్ లవ్ స్టొరీ గా తెరకెక్కిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల్లో 6 కోట్ల షేర్ ని రాబట్టింది . సినిమాకి ఫస్ట్ షో నుంచే అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లే రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. తొలిరోజు నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో రూ.15 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలిసింది.ఫస్ట్ వీకెండ్‌లో వచ్చిన రూ.15 కోట్లతోనే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయారు. కాబట్టి.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట.
Image result for nani majnu posters
విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మజ్ను’ చిత్రంలో నాని సరసన అను ఇమ్మానుయేల్, ప్రియాశ్రీలు హీరోయిన్లుగా నటించారు.యూఎస్‌లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయని అక్కడి ట్రేడ్ రిపోర్ట్స్ వెల్లడించాయి. ప్రీమియర్స్ ద్వారా $ 58,369 కలెక్ట్ చేసిన ఈ సినిమా.. ఆ తర్వాత శుక్రవారం $ 109,591, శనివారం $ 148,550 వసూలు చేసింది. అయితే.. ఆదివారం కేవలం $50K మాత్రమే కలెక్ట్ చేసింది.  మొత్తానికి ఈ ఏడాదిలో ‘జెంటిల్‌మన్’తో సాధించిన రికార్డ్‌ని నాని తనే బద్దలుకొట్టుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: