హ్యాట్రిక్ దర్శకులు కొరటాల శివ, హ్యాట్రిక్ విజయం సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఊహించిన దాని కంటే ఎక్కువే విజయం సాధించిందని చెప్పాలి. రిలీజ్ అయిన మొదటి రోజు యావరేజ్ టాక్ వచ్చిన మరుసటి రోజు నుంచి హిట్ టాక్ రావడంతో సినిమా అనూహ్యంగా కలెక్షన్లు పెరిగిపోతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని ఈ చిత్రం 11 రోజుల్లో రూ.50.45 కోట్లు కలెక్ట్ చేసింది. ‘బాహుబలి’ తర్వాత అతి తక్కువ రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఆ ఫీట్‌కి చేరుకున్న రెండో చిత్రంగా ‘గ్యారేజ్’ నిలిచింది.
Image result for janatha garage stills

గత రెండు వారాల్లో రిలీజ్ అయిన  జ్యో అచ్యుతానంద మంచి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ జనతా గ్యారేజ్ కి పోటీగా నిలబడలేక పోయింది. కాకపోతే  గత వారం  ‘మజ్ను’ రిలీజైన తర్వాత ‘గ్యారేజ్’ కలెక్షన్లు బాగా డ్రాప్ అయిపోయినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే.. ఈ వారంలో ‘హైపర్’ రిలీజవుతుండగా.. ఆ తర్వాత వారం నుంచి వరుసగా మంచి చిత్రాలే విడుదలవుతున్నాయి.


            Janatha Garage Four Days Collections

దాంతో.. ‘శ్రీమంతుడు’ రికార్డ్‌ని ఎన్టీఆర్ బ్రేక్ చేయడం కష్టమేనని తెలుస్తోంది. ఏదేమైనా.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని కూడా భారీ వసూళ్లతో టాలీవుడ్ ఆల్‌టైం రికార్డులో జాబితాలో మూడో స్థానంలో ‘గ్యారేజ్’ నిలవడం చెప్పుకోదగిన విషయమే.

జనతా గ్యారేజ్ 25 రోజులు  కలెక్షన్లు :

నైజాం : 18.9 కోట్లు
సీడెడ్ : 11.78 కోట్లు
వైజాగ్ : 7.50 కోట్లు
గుంటూరు : 6.1 కోట్లు
ఈస్ : 4.98 కోట్లు
వెస్ట్ : 4.60 కోట్లు
కృష్ణా : 4.40 కోట్లు
నెల్లూరు : 2.45 కోట్లు
మొత్తం ఏపీ + తెలంగాణ షేర్ : రూ.60.71 కోట్లు
కర్ణాటక : 8.6 కోట్లు
యూఎస్ఏ : 7.35 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ : 2.35 కోట్లు
కేరళ : 1.75 కోట్లు
రెస్టాఫ్ ఇండయా : 1.4 కోట్లు
తమిళనాడు : 1.15 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ : రూ.83.31 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ.135 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: