జూనియర్ రాజమౌళిల సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్.  టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా జాతీయ స్థాయికి ఎదిగిన రాజమౌళి 15 ఏళ్ల క్రితం ‘స్టూడెంట్ నెం.1’ సినిమా ద్వారా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజమౌళి తొలి సినిమాతో ప్రారంభం అయిన జూనియర్ రాజమౌళిల కాంబినేషన్ అప్పటి నుంచి ఇప్పటి దాక హిట్ కాంబినేషన్ గా కొనసాగుతూనే ఉంది.

రాజమౌళి దర్శకత్వం వహించిన  ‘స్టూడెంట్ నెం.1’ మూవీ రిలీజ్ అయి నిన్నటితో 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాజమౌళి అప్పటి రోజులను గుర్తుకు చేసుకుంటూ ఒక ట్విట్ చేసాడు.   ‘దర్శకుడిగా నేను పరిచయమై 15 ఏళ్లు అయ్యింది. కానీ నేను ఎడిటింగ్‌ అసిస్టెంట్‌గా చేరి 25 ఏళ్లు అయ్యింది. వినడానికి చాలా కాలంలా ఉంది. కానీ అలా అనిపించడం లేదు’ అంటూ ట్విట్ చేసాడు.

ఇదే సందర్భంలో రాజమౌళి మరొక ఆ శక్తికర విషయాన్ని బయట పెట్టాడు.  ‘స్టూడెంట్ నెం.1’ సినిమాను తీస్తున్న రోజులలో  స్విట్జర్లాండ్‌ లో ఒక పాట షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు తనకు తారక్ కు  ఒకే గది ఇచ్చిన సందర్భంలో జూనియర్ వల్ల తాను పడ్డ నరక యాతనను బయట పెట్టాడు రాజమౌళి.  తాను 9 గంటలకల్లా నిద్రపోతానని అయితే జూనియర్ అర్ధ రాత్రి 12 గంటల వరకు టివి చూసే అలవాటు ఉందన్న విషయాన్ని బయట పెట్టాడు రాజమౌళి.

అయితే స్విట్జర్లాండ్‌ లో తన రూమ్ లో తనతో కలిసి ఉన్న జూనియర్ అర్ధరాత్రి 12 గంటల వరకు టివి చూస్తూ తనను విపరీతంగా బాధ పెట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అప్పట్లో ఆ టార్చర్ భరించలేక తన మనసులో అనేక సార్లు జూనియర్ ను తిట్టుకున్న విషయాన్ని ఇప్పుడు బయట పెట్టాడు రాజమౌళి.  అదీకాకుండా జూనియర్ తన హోటల్ గదిలోని టివిలో చూసినది స్విస్ భాషలో ప్రసారం అయ్యే వ్యవసాయ కార్యాక్రమం అట.

అటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేసిన ఆనాటి తారక్ ను గుర్తుకు చేసుకున్నప్పుడు తనకు ఆశ్చర్యం కోపం రెండు ఇప్పటికీ కలుగుతూ ఉంటాయని అంటూ కామెంట్ చేసాడు  రాజమౌళి.  అంతేకాదు అప్పటి స్టూడెంట్ నెం.1’ విజయం క్రెడిట్ కథ రాసిన పృథ్వీతేజకి సంగీతం సమకూర్చిన కీరవాణికి చెందుతుంది అంటూ మరో కామెంట్ చేసాడురాజమౌళి.

ఈ సినిమా ఘనవిజయం సాధించిన తరువాత ఈసినిమా యూనిట్ తో కలిసి విజయ యాత్ర 19 ఏళ్ల కుర్రాడు గా ఉన్న జూనియర్ ను చూడటానికి జనం ఎగబడిన సందర్భం గుర్తుకు చేసుకుంటూ ఆనాడే తారక్ టాప్ హీరోగా మారిపోతాడు  అని తాను ఊహించుకున్నాను అని అంటున్నాడు రాజమౌళి.  జూనియర్ చేత జక్కన్న అంటూ అభిమానంగా పిలిపించుకునే రాజమౌళి దర్శకత్వంలో  మళ్ళీ మరో సినిమా రావాలని కలలు కంటున్న అభిమానుల కోరిక ఎప్పటికి తీరుతుందో తెలియక పోయినా మరోసారి రాజమౌళి జునియర్ పట్ల తన కున్న ప్రేమను ఈవిధంగా బయట పెట్టాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: