గీతాంజలి’ ‘ముంబాయి’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన మణిరత్నం ఈ మధ్య కాలంలో తన హవాను కోల్పోవడంతో చాలామంది టాప్ యంగ్ హీరోలు మణిరత్నం వైపు చూడటానికి పెద్దగా ఇష్టపడటం లేదు.  అయితే తిరిగి ‘ఓకే బంగారం’ తో హిట్ ట్రాక్ పైకి వచ్చిన మణిరత్నం మళ్ళీ టాప్ యంగ్ హీరోలతో సినిమాలు చేయడానికి కథలు వ్రాసుకుంటూ తన ప్రయత్నాలను తిరిగి మొదలు పెట్టాడు.

ఈ ప్రయత్నాలలో భాగంగా రామ్ చరణ్ మణిరత్నం చెప్పిన ఒక కథకు ఆకర్షితుడు అయ్యాడు అన్న వార్తలు వస్తున్నాయి.  ఒక క్లాస్ సినిమా చేసి ఎ క్లాస్ సెంటర్ల ఆడియన్స్ కు ఓవర్ సీస్ మార్కెట్ కు చేరువ కావాలని రామ్ చరణ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న నేపధ్యంలో తన ప్రయత్నాలకు వారధిగా మణిరత్నం సినిమాను మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘ధృవ’ తరువాత సుకుమార్ డైరక్షన్ లో ఒక లవ్ స్టోరీ చేస్తున్న నేపధ్యంలో ఆ సినిమా తరువాత దానికి కంటిన్యూషన్ గా మణిరత్నం సినిమా చేస్తే ఓవర్సీస్ మార్కెట్ ను పదిలం చేసుకోవచ్చు అన్న భావనతో చరణ్ ఈ ఎత్తుగడ వేస్తున్నట్లు టాక్.  దీనికితోడు  బన్నీ లేటెస్ట్ గా తమిళ మార్కెట్ లో ఎంటర్ అవుతున్న నేపధ్యంలో తన సినిమాల మార్కెట్ ను కూడ కోలీవుడ్ లో పెంచు కోవడానికి మణిరత్నం ఇమేజ్ తనకు బాగా సహాయ పడుతుందని చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. 

ఈ వార్తలు ఇలా ఉండగా రామ్ చరణ్ నటించిన మొట్టమొదటి సినిమా ‘చిరుత’ విడుదలై నేటితో 9 ఏళ్ళు పూర్తి అవుతోంది.  ఈ 9 ఏళ్ల కాలంలో చరణ్ ఇమేజ్ ని పెంచిన ఒక్క ‘మగధీర’ సినిమా తప్ప మరే సినిమా సామాన్య ప్రేక్షకులకు వెంటనేగుర్తుకు రాదు అన్న విషయం వాస్తవం. 

టాప్ యంగ్ హీరోల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడటంతో చరణ్ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఎన్నో సినిమాలలో నటిస్తూ ఉన్నా అ సినిమాలు మెగా అభిమానులకు నచ్చుతున్నాయి కాని సామాన్య ప్రేక్షకులకు ఇంకా చరణ్ చేరువ కాలేక పోతున్నాడు అన్న కామెంట్స్ ఉన్నాయి.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో రామ్ చరణ్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘ధృవ’ మూవీ రిజల్ట్ పై చరణ్ భవిష్యత్తులో నటించబోయే సినిమాల మార్కెట్ ఆధారపడి ఉంటుoది అన్నది వాస్తవం. మెగా కాంపౌండ్ కు సంబంధించి అల్లుఅర్జున్ నుండి సాయి ధరమ్ తేజ్ వరకు వారు నటిస్తున్న సినిమాలు వరస హిట్స్ గా మారుతూ ఉంటే 9 సంవత్సరాలు గడిచి  పోయినా చరణ్ కు ఒక్క ‘మగధీర’ తప్పించి మరే సినిమా చెప్పుకో తగ్గ సినిమా మిగలక పోవడం చరణ్ కు బయటకు చెప్పుకోలేని బాధ అనే అనుకోవాలి..
 



మరింత సమాచారం తెలుసుకోండి: