ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్న ‘నందిని నర్సింగ్ హోం’ ఆడియో ఫంక్షన్ లో హార్డ్ వర్క్ పై మహేష్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా లాంచ్ అవుతున్న ఈ మూవీ ఫంక్షన్ లో మహేష్ మాట్లాడుతూ హార్డ్ వర్క్ చేస్తే సక్సస్ తప్పకుండా ఏ వ్యక్తికైనా లభిస్తుందని అంటూ హార్డ్ వర్క్ కు షార్ట్ కట్స్ లేవు అంటూ సంచలన కామెంట్స్ చేసాడు మహేష్.
 
నవీన్ తనకు బాగా పరిచయం అని హీరో కావడానికి ముందు చాలా కష్టపడ్డాడని  అంటూ హార్డ్ వర్క్ చేసిన ఫలితం తప్పకుండా నవీన్ కు దక్కుతుందని అంటూ నవీన్ ను ప్రమోట్ చేసాడు మహేష్.  హైదరాబాద్ లో నిన్న సాయంత్రం ఘనంగా జరిగిన ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు అత్యధిక సంఖ్యలో మహేష్ అభిమానులు వచ్చి మహేష్ కు జోష్ ను కలిగించారు. 

సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ నుంచి రాబోతున్న కొత్త హీరో నవీన్ కృష్ణ కావడంతో ఈ ఆడియో ఫంక్షన్ గురించి మీడియా కూడా బాగా కవర్ చేసింది.  ఈ ఆడియో ఫంక్షన్ లో మహేష్ తో పాటు  త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మలలు పాల్గొనడంతో ఈ ఆడియో వేడుక కోలాహలంగా జరిగింది.  

డాక్టర్‌ అని అబద్ధం చెప్పి హాస్పిటల్లో చేరి పేషెంట్లతో ఆడుకునే కుర్రాడిగా కనిపించే పాత్రలో ఇందులో నవీన్‌ నటిస్తున్నాడు  ఇందులో  వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.  నవీన్ కు ఇది మొదటి సినిమానే అయినా ఎక్కడా కొత్త హీరోలా కనిపించకుండా మంచి ఈజ్ తో  తడబాటు లేకుండా నటించడం బాగుంది అంటూ ఈసినిమా ట్రైలర్ చూసిన చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. 

ఒక లవ్ స్టోరీకి కొంత సస్పెన్స్ మరి కొంత ట్విస్టులు కలిపి ఈ ‘నందిని నర్సింగ్ హోమ్’ కథను నడిపించినట్లుగా అనిపిస్తోంది.  ఇప్పటికే వారసత్వ హీరోలతో నిండిపోయిన టాలీవుడ్ కు విజయ్ కృష్ణ రాకతో ఆ లిస్టు మరింత పెరిగి పోయింది.  మహేష్ అభిమానులు విజయ్ కృష్ణను ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: