" మెగా హీరో " అనే టాగ్ కి ఉన్న రేంజ్ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పొలిటికల్ గా ఎంత పెద్ద ఫైల్యూర్ అయినా చిరంజీవి స్టామినా సినిమా రంగంలో ఎంతగా ఉంది అనేది చెబుతుంది ఆ టాగ్. ఆ పేరుతో " మెగా హీరోని " అంటూ ఎవరు అడుగు పెట్టినా ప్రజలు మొదటి రెండు సినిమాల వరకూ బ్రహ్మరథం పట్టేస్తారు, మూడో సినిమా వరకూ ఛాన్స్ ఇచ్చి నీ టాలెంట్ ఏంటో నిరూపించుకో అంటారు. ఇది అందరి హీరోల, వంశాల , ఫామిలీల కి సాధ్యం కాదు . మిగితా ఫ్యామిలీ ల నుంచి ఒక కొత్త హీరో ఒస్తే జనం ఆసక్తిగా చూస్తారు కానీ మెగా హీరో టాగ్ తో ఒస్తే మాత్రం నెత్తికి ఎక్కించేసుకుంటారు . అది మెగా హీరోలకి ఒకరకంగా వరం అయినా మరొక రకంగా శాపం అని చెప్పచ్చు. వారి మీద మొదటి నుంచే భారీ ఎక్స్ పెక్టేషన్ లు పెరిగిపోతూ ఒస్తాయి దాంతో అది రీచ్ అవ్వగలరా లేదా అనేది పెద్ద టెన్షన్. ఏదేమైనా మెగా ట్యాగ్ తో వచ్చిన ఏ హీరో నీ ప్రేక్షకులు డిసప్పాయింట్ చెయ్యరు. అంతటి ఫౌండేషన్ ని సినిమా ఫీల్డ్ లో క్రియేట్ చేసిన నటుడు ' చిరంజీవి ' .

శివ శంకర ప్రసాద్ గా ఎదిగి చిరంజీవి గా స్థిరపడిన ఆయన ఎన్నో కోట్ల మందికి ఆదర్శం, ఎన్నో వందలమంది ఇళ్ళు వదిలి రైళ్ళు ఎక్కి సినిమా ఫీల్డ్ కి రావడానికి ఇన్స్పిరేషన్. అలాంటి గొప్ప వ్యక్తి కుమారుడి సత్తా ఎలా ఉండాలి ? అతను తనని తాను ప్రూవ్ చేసుకోగలిగిన టాలెంట్ ఎలా ఉండాలి ? ఇవాళ్టి కి రామ్ చరణ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతోంది , ఇన్నేళ్ళ తన ప్రయాణం లో ' చిరు ' తనయుడు ఎంత ఎదిగాడు ? ఎంత ఒదిగాడు  ? అనేది చూద్దాం .. దశాబ్దాలు గా తెలుగు సినిమా ని ఏకచ్ఛత్రాధిపత్యంగా  ఏలుతున్నాడు మెగాస్టార్. ఆయన పొలిటికల్ ఎరీనా కోసం ఏడు సంవత్సరాలు రాజకీయాలవైపు వెళ్లి సినిమాలకి తాత్కాలికంగా శలవు పెట్టినా ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కుర్చీ అక్కడే ఉంది .. అదీ ఆయన రేంజ్. హీరో అవ్వకముందరే మెగా పవర్ స్టార్ అంటూ తండ్రిలోని నటన నీ బాబాయ్ పవన్ కళ్యాణ్ లోని క్రేజ్ నీ అందిపుచ్చుకునే ప్రయత్నం చేసాడు మెగా స్టార్ తనయుడు.

మొదటి సినిమా చిరుత తో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకుని ఆ సినిమాతో మంచి హిట్ కొట్టిన చరణ్ రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన హీరోగా రికార్డులకి ఎక్కేసాడు. చిరంజీవిని నెంబర్ 1 హీరోగా మార్చడం లో అల్లూ అరవింద్ కృషి ఎంతైనా ఉంది . ఆయన సహాయంతో ఎస్.ఎస్. రాజమౌళిలాంటి ది బెస్ట్ హార్డ్ వర్కర్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రతిభ, కృషి తోడవ్వడంతో ‘మగధీర’తో చరిత్ర సృష్టించాడు చరణ్. రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అంటే ఎవ్వరికీ అందని రికాడు ఇది . ఇండస్ట్రీ హిట్ కొడితే చాలు నెంబర్ 1 అయినట్టే అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళ దృష్టిలో మనోడు సూపర్ గా నెంబర్ 1 అయిపోయాడు .. సో ఇంక చెయ్యడానికి ఏముంటుంది? అంతా సాధించేసాను అని చరణ్ కూడా అనుకునునట్టు ఉన్నాడు .. వెంటనే ప్లాపులు పలకరించాయి . ఆరంజ్ లాంటి ప్లాపులతో వెనకపడ్డాడు. రచ్చ నుంచీ బ్రూస్ లీ వరకు పరవాలేదు అనే సినిమాలు తీస్తూ ముందుకు సాగుతున్నాడు. మధ్యలో బాలీవుడ్ చేరినా అది కూడా చాలా పెద్ద ప్లాప్ గా మిగలడం రామ్ చరణ్ కి బ్యాడ్ న్యూస్.

ఆరంజ్ లాంటి ప్రయోగం ప్లాప్ అవ్వడం తో ఇప్పటి వరకూ ఒక్క ప్రయోగానికి కూడా వెళ్ళలేదు చరణ్. దూరంగా ఉంటూ రొటీన్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నాడు. ఈ ధోరణి వలన నెమ్మది నెమ్మదిగా లవర్స్, క్లాస్ ఆడియన్స్, ఓవర్సీస్ ఆడియన్స్ అందరికీ దూరమయ్యాడు. ఫైనల్‌గా రాజశేఖర్, సాయికుమార్‌లలాగా బి, సి థియేటర్స్‌ హీరోగా మిగిలిపోయే పరిస్థితి ఎంతో దూరంలో లేదు అంటున్నారు విశ్లేషకులు. ఆరెంజ్ దెబ్బతో భయపడి రాంగ్ స్టెప్ తీసుకున్న చరణ్ బ్రూస్ లీ దెబ్బతో రైట్ స్టెప్ కి మారాడు అంటున్నారు అతని ఫాన్స్. సురేందర్ రెడ్డి దర్సకత్వం లో వస్తున్న ధ్రువ సినిమా చరణ్ కెరీర్ కి చాలా పెద్ద సినిమా. అతని కెరీర్ ని డిసైడ్ చేసే సిఎంమా అని చెప్పాలి. మాస్ ఫానిజం , హీరోయిజం లేని కథ అని తెలిసినా కూడా విశ్లేషకులు, సన్నిహితులు కూడా భయపెట్టినప్పటికీ ‘థనీ ఒరువన్’ సినిమా రీమెక్‌లో నటించడానికి రెడీ అయ్యాడు రామ్ చరణ్.


ఈ సినిమా దెబ్బతో ఓవర్ సీస్ లో గట్టి పాగా వెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నాడు చరణ్. అలాగే సుకుమార్ సినిమా కూడా చరణ్ సంతకం పెట్టడం తనలోని వైవిధ్యమైన కోణానికి సంకేతం అనే చెప్పాలి. చరణ్ కి అండగా చిరు ఫాన్స్ - పవన్ ఫాన్స్ ఎప్పుడూ ఉండనే ఉన్నారు. కానీ సినిమాలు విరివిగా చేస్తూ కొత్తదనం తో పాటు ఆసక్తికర కథలు ఎంచుకుంటూ రొటీన్ కి భిన్నంగా వెళ్ళాలి అనేది వారందరి కోరికా. సినిమాల సంగతి పక్కన పెడితే చరణ్ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ ని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. అల్లూ అర్జున్ లాగా ' చెప్పను బ్రదర్ ' లాంటి వివాదాల్లో అతను ఎప్పుడూ ఇరుక్కోలేదు. ఎప్పుడూ ఎవరినీ ఎదిరించనూ లేదు, మెగా ఫామిలీ లో ఏర్పడిన మల్లగుల్లాలు సర్దడం లో చరణ్ కి చరణే సాటి అని చెప్పాలి.


చిరు - పవన్ లు రాజకీయ సిద్దాంతాల పరంగా వేరు అయిపోయిన తరుణం లో వారిద్దరినీ ఒకతాటి పైకి తీసుకొచ్చిన ఘనత చరణ్ దే. తన హోదా ఏంటో, తన లిమిట్స్ ఏంటో బాగా తెలిసిన మెచ్యూరిటీ ఉన్న హీరోలలో చరణ్ టాప్ లో ఉంటాడు. ఈ విషయం లో మాత్రం బాబాయ్ లోని సైలెన్స్ - ఆవేశం , తండ్రిలోని మంచితనం చరణ్ పుణికిపుచ్చుకున్న భావాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: