ఇప్పటికే ‘బ్రహ్మోత్సవం’ ఫెయిల్యూర్ షాక్ లో ఉన్న మహేష్ అభిమానులు వచ్చే సమ్మర్ కు రాబోతున్న మురగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా గురించి ఎదురు చూస్తున్నారు.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా టీజర్ ను రాబోతున్న దీపావళికి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

దీనితో ఈసినిమా టైటిల్ ఎంపిక పై దర్శకుడు మురగ దాస్ తన దృష్టిని పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాను తెలుగు తమిళ భాషలలో ఒకేసారి నిర్మిస్తూ ఒకేసారి విడుదల చేయబోతున్న నేపధ్యంలో ఈసినిమాకు తెలుగు తమిళ ప్రేక్షకులకు అర్ధమయ్యే ఒకే టైటిల్ ను పెట్టాలని మురగదాస్ ఆలోచన అని అంటున్నారు.

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించే మొదట ‘ఎనిమీ’ అని ఆతరువాత ‘వాస్కోడి  గామా’ అని రకరకాల టైటిల్స్ ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి.  అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమాకు ‘అభిమన్యుడు’ అన్న టైటిల్ ఖరార్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ న్యూస్ మహేష్ అభిమానులకు నిద్ర పట్ట నివ్వకుండా చేస్తోంది అని టాక్.  దీనికి కారణం ఈ టైటిల్ తో గతంలో వచ్చిన సినిమాలు అన్నీ ఘోరమైన ఫ్లాప్ లుగా మారాయి.  

1984లో ఒకనాటి అందాల నటుడు శోభన్ బాబు హీరోగా వచ్చిన ‘అభిమన్యుడు’ ఘోరమైన ఫ్లాప్.  ఆ తరువాత మరి కొన్ని సంవత్సరాల గ్యాప్ తో నందమూరి కళ్యాణ్ రామ్ ‘అభిమన్యు’ అన్న టైటిల్ తో మరో సినిమా వచ్చింది అది కూడ భయoకరమైన ఫ్లాప్.  

ఇటువంటి ఫ్లాప్ సెంటిమెంట్స్ తో కూడుకున్న ఈ టైటిల్ ను మహేష్ బాబు సినిమాకు టైటిల్ గా పెట్టాలని మురగదాస్ కు ఎలా ఆలోచన వచ్చింది అంటూ మహేష్ అభిమానులు విపరీతమైన కోపంతో మురగ దాస్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.  దీనితో మహేష్ అభిమానులకు శోభన్ బాబు భయం పట్టుకుంది అంటూ సెటైర్లు పడుతున్నాయి. మరి ఈ విషయాలు మురగదాస్ దృష్టి వరకు వెళతాయి కాబట్టి మహేష్ అభిమానుల అభిప్రాయాలకు  మురగ దాస్ ఆలోచనలు ఈ టైటిల్ విషయంలో ఎలా మారుతాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: