అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తున్నాయి.‘ప్రేమమ్’ కచ్ఛితంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. కథా బలమే ‘ప్రేమమ్’ మూవీ సక్సెస్ కి కారణం అనేది చిత్ర యూనిట్ నమ్ముతుంది. అందుకే ‘ప్రేమమ్’ సక్సెస్ పై చిత్ర యూనిట్ తో పాటు ప్రత్యేకంగా హీరో గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. గత కొంత కాలంగా అక్కినేని నాగచైతన్యకి సరైన సక్సెస్ లేదు.

ఇక ‘ప్రేమమ్’మూవీతో అయినా ఇండస్ట్రీ హిట్ ని అందుకుంటాడేమో అని అంటున్నారు. ఇదిలా ఉంటే ‘ప్రేమమ్’ మూవీ కమర్షియల్ సక్సెస్ ని పొందటానికి నాగార్జున అన్ని విధాలుగా తన వంతు ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే పలుసార్లు ‘ప్రేమమ్’ మూవీపై పాజిటివ్ ప్రచారాన్ని చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 7న ‘ప్రేమమ్’ విడుదల కానుంది. తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాని నాగార్జున చూశారు.

దీంతో ఈ మూవీ సక్సెస్ పై నాగార్జున ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రేమమ్ చూశానని, సినిమా చూశాక ఇప్పుడు ఇంటికి సంతోషంగా వెళుతున్నానని నాగార్జున అన్నారు. అయితే ఇక్కడే ఓ చిన్న విషయం ప్రేక్షకులను గుచ్చుకుంది. నాగచైతన్యకి ఇంకా స్టార్డం అనేది రాలేదా? అనే విషయం అందరిలో కలుగుతుంది. పలు సినిమాలతో హిట్స్ ని అందుకున్న ఈ హీరో…ఇంకా స్టార్డంని అందుకోలేకపోయాడనే కామెంట్ స్వయంగా నాగార్జున నుండి రావటంతో అందరూ షాక్ అయ్యారు.

‘కార్తికేయ’తో పరిచయమైన దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్.. హీరోయిన్లుగా నటించారు. మొత్తంగా నాగార్జున, నాగచైతన్యపై చేసిన ఈ కామెంట్స్ అందరిలోనూ చర్ఛలకు దారి తీస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘ప్రేమమ్’ మూవీపై ప్రమోషన్స్ పై చిత్రయూనిట్ వేగంగా పనిచేస్తుంది. సాధ్యమైనంత వరకూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: