ఇప్పటి వరకూ మెగాస్టార్ చిరంజీవే అందరితో మైండ్ గేమ్ ఆడేవాడు. సినిమాలు, రాజకీయాలు…మళ్ళీ సినిమాలు….ఇలా తన ప్రయాణంలో చిరంజీవి మనుషులను అంచనా వేయటంలో తనకు తానేసాటి అనిపించుకున్నాడు. ఇలా ఉంటే తాజాగా స్టార్ కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా మాత్రం మెగాస్టార్ చిరంజీవి తో గేమ్ ఆడటం మొదలు పెట్టాడు. గతంలో చిరంజీవి నటించిన పలు సినిమాల్లో ప్రభుదేవా నృత్య దర్శకత్వం వహించాడు.


చిరు కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసిన డ్యాన్స్ లకి ప్రత్యేక ఆధరణ వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్…కుర్రకారుని ఓ ఊపు ఊపింది. అయితే ప్రస్తుతం ప్రభుదేవా చిరు 150వ సినిమా అయిన ఖైదీనెం.150వ చిత్రానికి సైతం కొరియోగ్రఫి చేస్తున్నాడంటూ టాక్స్ వచ్చాయి. ఇందులో నిజం లేదని ప్రభుదేవా తేల్చేశాడు. అయితే చిరంజీవి నుండి పిలుపువస్తే మాత్రం ఆయన సినిమాకి పనిచేస్తానని ప్రభుదేవా చెప్పాడు.


నిజానికి ప్రభుదేవా ఇప్పటికే చిరు 150వ కోసం పనిచేస్తున్నాడంటూ చిత్ర యూనిట్ నుండి క్లియర్ టాక్స్ వస్తున్నాయి.  ఇటువంటి సమయంలో తను చిరు మూవీకి పనిచేయటం లేదంటూ చేసిన ప్రభుదేవా కామెంట్స్ కి మెగాస్టార్ చిరంజీవి సైతం షాక్ అయ్యాడని అంటున్నారు. ప్రభుదేవా ఇచ్చిన ఈ విధమైన భిన్న స్టేట్మెంట్స్ కి కారణం ఏంటి? అనేది ఇంకా తెలియాల్సింది.


ప్రభుదేవా పబ్లిసిటీ కోసం కామెంట్స్ చేస్తున్నాడా? లేక మెగాస్టార్ తో గేమ్ ఆడుతున్నాడా? అనేది తెలియాలి. తాజాగా జరిగిన ఈ పరిణామానికి మెగాస్టార్ సైతం ఆశ్ఛర్యపోయాడని అంటున్నారు. ఒకవేళ ప్రభుదేవా ఇప్పటికీ మెగాస్టార్ మూవీకి పనిచేయకపోతే…తన కామెంట్స్ తో ప్రభుదేవాని చిరు పిలిచే ఛాన్స్ ఉంటుందా? అంటూ అంతటా చర్ఛలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఓ సాంగ్ వస్తే…ప్రేక్షకలు కూడ చూడాలని కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: