టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని కొనసాగించిన బ్యూటీ కాజల్ అగర్వాల్. ఇంతటితో ఆగకుండా అప్పడప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ కాజల్ అగర్వాల్ సినిమాలలో నటిస్తూ తన సత్తా చాటుతుంది. దీంతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ కి మంచి మార్కెట్ ఉంది. మంచి కథా చిత్రాలు అయితే కాజల్ అగర్వాల్ కచ్ఛితంగా బాలీవుడ్ లో నటించేందుకు సిద్ధంగా ఉంది.


సౌత్ లో కాజల్ అగర్వాల్ కి అవకాశాల వరద ఎక్కువుగా ఉంటుంది. కానీ బాలీవుడ్ లో మాత్రం అలా కాదు. కాజల్ అగర్వాల్ అవకాశాల కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి. గతంలో షాహిద్ కపూర్ తో నటించాల్సిన కాజల్ అగర్వాల్ కి...ఆ సినిమా ఆఫర్ చివరి నిముషంలో మిస్ అయింది. ఇక ఆ సమయంలో షాహిద్ కపూర్ తో కాజల్ అగర్వాల్ కాస్త రిలేషన్ ని సైతం మెయింటెన్ చేసిందనే టాక్స్ వినిపిస్తున్నాయి.


ఆ సమయంలో కాజల్ అగర్వాల్ కి సంబంధించిన లగ్జరీ కారుని షాహిద్ కపూర్ ఎక్కువుగా వాడుకున్నాడని అంటున్నారు. కాజల్ అగర్వాల్ కి ముంబాయ్ లో  మంచి ఇల్లు ఉంది. అలాగే తనకి ఓ లగ్జరీ కారు కూడ ఉంది. కాజల్ కారుని కొన్ని రోజుల పాటు షాహిద్ ఎక్కువుగా ఉపయోగించుకున్నాడు. ఎప్పుడైతే వీరిద్దరి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందో...అప్పటి నుండి కాజల్ అగర్వాల్ కి షాహిద్ కపూర్ ఫోన్ చేసిన సంర్భంలేదంట.


రీసెంట్ గా ఈ బ్యూటీ దీనికి సంబంధించిన వివరాలను తన స్నేహితులకి చెప్పటంతో ఇది బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకూ తనకి పరిచయం అయిన హీరోలలో తనకి సంబంధించిన వస్తున్నవులను చనువుతో వాడుకున్నది షాహిద్ కపూర్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. అలాగే షడన్ గా రిలేషన్ ని కట్ చేసిన వ్యక్తి కూడ షాహిద్ కపూర్ అంటూ ఈ బ్యూటీ చెప్పటం విశేషం. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో రెండు సినిమాల్లో చేస్తుంది. తమిళంలో 3 చిత్రాలకి కమిట్మెంట్ ఇచ్చింది. అలాగే హిందీలోనూ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: