ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం ‘హైపర్’. ‘హైపర్’ మూవీ తాజాగా విడుదలకు సిద్ధం అవుతుంది. గతంలో రామ్ నటించిన చివరి చిత్రం ‘నేను శైలజా’ తనకి మంచి హిట్ ని ఇచ్చింది. ఇప్పుడు అదే సక్సెస్ తో ‘హైపర్’ వంటి ఎనర్జిటిక్ కథతో థియోటర్స్ ని హిట్ చేయనున్నాడు. ఇదిలా ఉంటే ‘హైపర్’ మూవీకి సంబంధించిన బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందని అంటున్నారు.


ఇప్పటి వరకూ రామ్ మూవీలకి ఏనాడు జరగని విధంగా, ‘హైపర్’ ప్రి బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ‘హైపర్’ ట్రైలర్, పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందడంతో....బిజినెస్ వర్గాల్లోనూ ఈ మూవీ కచ్ఛితంగా మంచి విజయాన్ని అందుకుంటుందని భావించారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ నుండి ‘హైపర్’ మూవీకి మంచి రిపోర్ట్స్ రావటంతో ఈ మూవీకి ప్రి బిజినెస్ బాగా జరిగింది.


బిజినెస్ కి సంబంధించిన వివరాలను చూస్తే...నైజాం, సీడెడ్, ఆంద్ర, ఓవర్సీస్ కు సంబందించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులు అనుకున్న రేట్ల కంటే ఎక్కువుగా అమ్ముడుపోయాయి. అలాగే తాజాగా ‘హైపర్’ మూవీ శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటు పలికింది. టీవీ ఛానెల్ ‘జీ తెలుగు’ 6.3 కోట్లరూపాయలకి ఈ హక్కులను తీసుకొంది. దీంతో నిర్మాతలకి మూవీ రిలీజ్ కంటే ముందుగా దాదాపు 5 కోట్ల రూపాయల లాభాలను చూసినట్టుగా ఇండస్ట్రీ నుండి అందుతున్న రిపోర్ట్స్.


ఇక 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 30న భారీ ఎత్తున విడుదలకానుంది. హైపర్ మూవీలో గ్లామర్ క్వీన్ రాశి ఖన్నా అందాలు చిత్ర కథనానికి ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించిందంటే...మళ్ళీ రామ్, రాశిఖన్నా కాంబినేషన్ లో మరో మూవీ రానుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: