ప్రముఖ టివి ఛానల్ లో బతుకు జట్కాబండి అనే ప్రోగ్రాం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులని నిద్రలేకుండా చేస్తుంది. వ్యక్తిగత కుంటుంబ వ్యవహారాలను ఛానల్ ప్రముఖంగా చూపిస్తూ... ఆ సమస్యని పరిష్కరించటం ఈ ప్రొగ్రాం ప్రధాన ఉద్ధేశం. ఇప్పటికే చెరో దిక్కుకు వెళ్ళిపోయిన పెళ్ళిబంధాలను..వీరు పిలిచి...ప్రొగ్రాం వేధికగా ఛానల్ లో ఒకటి చేస్తారు.


ఇందులో భాగంగానే వీరు చాలా మందికి ఫోన్స్ చేసి..షో లో పార్టిసిపెట్ చేయాల్సిందిగా బలవంత పెడుతున్నారనేది బాధితులు ఆరోపణలు. తాజాగా నటుడు రాజశేఖర్ భార్య జీవితపై ఓ ఆటో డ్రైవర్ కేసు వేయటంతో ఈ విషయం వెలగులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఆటో డ్రైవర్ కొండాకి నటి జీవిత, ఆమె ఇద్దరు పిఏ లు తనను కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఫోన్లు చేసి విసిగించి, బెధిరిస్తున్నట్టుగా తను ఆరోపణలు చేస్తున్నాడు.


అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు కూడ నమోదు చేశాడు. దీంతో పోలీసులు వారిపై 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు స్టార్ యాక్టర్, పొలిటికల్ లీడర్ రోజా సైతం ఈ తరహా షోనే మరో ప్రముఖ ఛానల్ లో చేస్తుంది. రచ్ఛబండ అంటూ చేస్తున్న ప్రోగ్రాంలోనూ ఈ తరహా కంప్లైయింట్స్ బయటకు వస్తున్నాయి. దీంతో ఈ షోకి సంబంధించిన నిర్వాహకులు బతుకుజట్కాబండి తరహా కంప్లైయింట్స్...ఈ షోకి రాకుండా జాగ్రత్తపడుతున్నారు.


ముఖ్యంగా గొడవలు లేకుండా వ్యక్తులతో మాట్లాడాలని రోజా...షో నిర్వాహకులకి తెలియజెప్పిందని అంటున్నారు. ఇప్పటి వరకూ రచ్ఛబండలో దురుసుగా వెళుతున్న రోజా వ్యవహారం..ఇప్పుడు కాస్త తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తంగా కొండా అనే ఆటోడ్రైవర్ కేసుతో...ఈ తరహా షోలకి కాస్త దూకుడు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: