తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మాస్ హీరోగా పరిచయం అయ్యారు. తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకున్నా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘చత్రపతి’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో ప్రభాస్ స్టార్ ఇమేజ్ కూడా ఒక్కసారే టర్న్ అయ్యింది. తర్వాత వచ్చన బుజ్జిగాడు, డార్లింగ్,మిస్టర్ పర్ఫెక్ట్,మిర్చీ లాంటి సినిమాలతో స్టార్ హోదా దక్కించుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహబలి’ చిత్రం ప్రభాస్ రేంజ్ ఎక్కడికో తీసుకు వెళ్లింది. అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకే పరిమితమైన ప్రభాస్ తమిళ,హిందీ ఇండస్ట్రీలో కూడా దుమ్మురేపాడు.
Image result for baahubali 2 shooting
ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఇక అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఇండస్ట్రీలో బాహుబలి చిత్రం వచ్చేంత వరకు ప్రభాస్ స్టార్ డమ్ ఒకతీరుగా ఉంటే బాహుబలి చిత్రం తర్వాత ప్రపంచ స్థాయిలో పెరగిపోయింది. దీంతో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు కూడా భారీ ఎత్తున నిర్వహించాలనుకుంటున్నారట.
Image result for baahubali 2
అంతే కాదు ప్రభాస్ పుట్టినరోజు నాటికి బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తి కానుండటం తో ప్రభాస్ పుట్టినరోజు ని పునస్కరించుకొని బాహుబలి ది కంక్లూజన్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు . ఆ మేరకు జక్కన్న సన్నాహాలు చేస్తున్నాడట. ఇక ప్రభాస్ పుట్టి రోజు కోసం ఆయన అభిమానులే కాకుండా సినీ ప్రేమికులు కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఆ రోజు నుంచి ప్రభాస్ కొత్త చిత్రం కూడా ప్రారంభం కాబోతుందని టాక్. బాహుబలి పార్ట్ 2 వహ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: