సౌత్ హీరోయిన్స్ లో కాజల్ క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే.. అయితే ఆమెను కేవలం ప్రేక్షకులే కాదు సినిమా వాళ్లు నచ్చుతారు. లక్ష్మి కళ్యాణంతో కెరియర్ ప్రారంభించిన కాజల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకుంది. ఇక తను స్టార్ అయ్యే ప్రయత్నంలో ఆమెతో సినిమాలు తీసిన దర్శకులు కూడా ఆమెను ఎంతో ఇష్టపడతారు. అయితే కాజల్ పై ఇంతవరకు తనతో సినిమా తీయని ఓ దర్శకుడు మనసు పారేసుకున్నాడు.


ఈరోజుల్లో అనే చిన్న సినిమాతో మొదలై ఏకంగా స్టార్ హీరోలతోనే సినిమా తీసే రేంజ్ కు ఎదిగిన మారుతి కాజల్ అంటే అదో ప్రత్యేకమైన ఇష్టం అంటున్నాడు. కాజల్ స్మైల్ ఎక్స్ ప్రెషన్స్ అన్ని సూపర్ అనేస్తున్నాడు మారుతి. ఆమె ఒప్పుకుంటే సినిమా చేసేస్తా అంటున్నాడు కూడా. మరి మారుతి ఇంత ఇష్టపడుతున్నాడుతాన్నడని కాజల్ కు తెలుసో తెలియదో కాని ఫేడవుట్ కు దగ్గరవుతుంది అనుకుంటున్న టైంలో అమ్మడు లక్కీ ఆఫర్లనే కాదు లక్కీ ఫ్యాన్స్ ను కూడా ఏర్పాటుచేసుకుంటుంది.


సో ఈ ఊపుచూస్తుంటే కాజల్ ఊ.. అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే కాని ఆమెతో వరుసెంట సినిమాలు చేసేలా ఉన్నాడు మారుతి. రీసెంట్ గా బాబు బంగారం హిట్ తో మంచి జోష్ లో ఉన్న మారుతి ఇప్పుడు కొత్త హీరోతో సినిమా తీసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు కథలను సిద్ధం చేసుకున్న మారుతి ఒకటి స్టార్ కు వినిపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. 


దర్శకుడిగా ఎప్పుడు తను నూటికి నూరు పళ్లు న్యాయం చేసే మారుతి దర్శకత్వంలో ఏ హీరో అయినా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. మంచి కథ దొరకాలే కాని మారుతి మరో ట్రెండ్ సెట్ సినిమా దర్శకుడిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: