సౌత్ సూపర్ హీరోయిన్ సమంత తెలుగు తమిళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించింది. అయితే కొద్దిరోజులుగా అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం కొనసాగిస్తున్న సమంత ఆ మ్యాటర్ గురించి ఎక్కడ ఏమి నోరు విప్పలేదు కాని ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇక ప్రతిసారి మీడియా ముందుకు వస్తున్న కింగ్ నాగార్జున వారి పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.


అయితే మరికొద్దిరోజుల్లో నిశ్చితార్ధం ఆ తర్వాత పెళ్లి అంటూ హడావిడి చేస్తున్న ఈ టైంలో సమంత చేసుకునేది రెండో పెళ్లి అంటూ వార్తలు గుప్పుమనాయి. అదేంటి సమంత ఇదవరకే పెళ్లి చేసుకుందా అదెలా అబ్బా అంటూ దానికి సంబందించిన క్లూలు వెతకడం మొదలు పెట్టారు. అయితే ఎంత వెతికినా ఆ క్లూస్ దొరికే ఛాన్స్ లేవనుకుంటా.. చైతుతో ప్రేమకు ముందు లవర్ బోయ్ సిద్ధార్థ్ తో ప్రేమ పాటలు పాడిన సమంత ఇద్దరు అప్పట్లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని ఓ రూమర్ ఉంది.


ఆల్రెడీ సిద్ధుకి పెళ్లైంది కాబట్టి సమంతతో పెళ్లంటే ఎవరు ఒప్పుకోరనే ఉద్దేశంతో సీక్రెట్ గా కానిచ్చేశారట. కాని ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. అందుకే సమంత చేసుకునేది రెండో పెళ్లే అన్నది కొంతమంది వాదన. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ విషయాలన్ని నాగ చైతన్యతో ముందే చెప్పేసిందట అమ్మడు. అన్నిటికి ఓకే అన్న తర్వాతే ఇద్దరు పెలికి రెడీ అయ్యారు.


సో మొత్తానికి సమంత నాగ చైతన్యల పెళ్లి మీద ఇలాంటి కొత్త సెటైర్స్ పడుతున్నాయి. ఇక అదలా ఉంటే తండ్రి నాగార్జున అప్పట్లో టాప్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిస్తే తనయుడు నాగ చైతన్య కూడా అదే తరహాలో క్రేజ్ లో ఉన్న సమంతను పెళ్లాడుతూ అందరికి షాక్ ఇస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: